ఒకప్పుడు పెళ్లయ్యాక చనిపోయే వరకు కూడా భార్య పరాయి మగవాడిని మరో ఉద్దేశంతో చూడడం కాదు కదా.. కనీసం మనసులో ఊహించుకోవడం కూడా ఎంతో తప్పుగా భావించే వారు. అయితే ఇప్పుడు సమాజం తీరు మారిపోయింది. అక్రమసంబంధాలు పెరిగిపోతున్నాయి. అయితే లవ్, రిలేషన్‌షిప్, వివాహ బంధం.. ఎలాంటి సంబంధంలో అయినా కొన్నిసార్లు భాగస్వామిని మోసం చేసే అవకాశం ఉంది. కానీ పురుషులే ఎక్కువగా మోసం చేస్తారనే భావన చాలామందిలో పాతుకుపోయింది. దీని వెనుక సైకలాజికల్, ఎమోషనల్ రీజన్స్ చాలా ఉండవచ్చని రిలేషన్‌షిప్ ఎక్స్‌పర్ట్స్ చెబుతున్నారు. నిజానికి మగవాళ్లు కొన్ని కారణాల వల్ల తమ భాగస్వామిని మోసం చేయవచ్చు. ఎమోషనల్ కనెక్షన్ లేకపోవడం.. చాలా మంది పురుషులు తమ భార్య లేదా ప్రియురాలితో స్ట్రాంగ్ ఎమోషనల్ బాండ్ ఉండాలని కోరుకుంటారు.
బలంగా లేదని భావిస్తే, ఆ బాండింగ్ కోసం బయట వెతుకుతారు. ఇందుకు పార్ట్నర్‌ను మోసం చేస్తారు. వారితో బాధలు, ఆనందాలు పంచుకోలేకపోతున్నట్లు అనుకుంటే ఈ లోటును తీర్చుకోవడానికి వేరొకరితో అఫైర్ పెట్టుకుంటారు. ఇలా జరగకుండా ఉండాలంటే ఫిమేల్ పార్ట్‌నర్స్, మగవారితో రోజూ మాట్లాడాలి. వారిలో నిరాశ వ్యక్తం అవుతుంటే ప్రేమగా చూసుకోవాలి. ఆత్మగౌరవం తక్కువగా ఉండటం.. కొందరు మగవారికి ఆత్మగౌరవం తక్కువగా ఉంటుంది. తమ అందం, తెలివి, సామర్థ్యం గురించి తక్కువగా అంచనా వేసుకుంటారు. ఫెయిల్యూర్స్ లాగా తమను తాము పరిగణిస్తారు. ఒక్కరే కాకుండా ఎక్కువ మంది ప్రేమిస్తే అప్పుడు వీరికి సంతృప్తి కలుగుతున్నట్టు అనిపిస్తుంది.
అందుకే వారు మరొకరితో సంబంధం పెట్టుకోవడానికి ప్రయత్నిస్తారు. అవకాశం.. కొందరు మగవాళ్లు తమ భాగస్వామిని మోసగించే అవకాశం దొరికితే, అస్సలు వదులుకోరు. వారిని ఎవరూ పట్టుకోలేనట్టు భావిస్తారు. ఇలాంటి అవకాశాన్ని వంద శాతం సద్వినియోగం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు. ఇంకొందరు అఫైర్ మెయింటైన్ చేయడం ఒక ప్రెస్టేజ్‌గా తీసుకుంటారు. సోషల్ సర్కిల్‌లో షో ఆఫ్ చేయడానికి కూడా ఫిమేల్ పార్ట్నర్‌ను మోసం చేయవచ్చు. ఉత్సాహం కోసం.. పురుషులు తమ ప్రస్తుత రిలేషన్‌షిప్ బోరింగ్‌గా అనిపిస్తే, ఫిమేల్ పార్ట్నర్‌ను మోసం చేయవచ్చు. కొత్త వ్యక్తి లేదా కొత్త సంబంధం వల్ల వారి జీవితం ఉత్సాహంగా, కలర్‌ఫుల్‌గా మారుతుందని భావిస్తారు. కొంతమంది ఆల్కహాల్ ఇన్‌ఫ్లుయెన్స్‌లో కూడా చీట్ చేయవచ్చు. కొత్త లైంగిక అనుభవాల కోసం..కొందరు మగవాళ్లు ఎప్పుడూ ఒకే మహిళతో శృంగారం చేయడాన్ని బోరింగ్‌గా భావిస్తారు.
వారికి కొత్త అనుభవాలు కావాలనిపిస్తుంది. ఈ కోరిక కారణంగా మరొక మహిళకు ఆకర్షితులవుతారు. ఒకే మహిళకు శాశ్వతంగా కమిట్ అవ్వాలనే ఆలోచన వారికి అస్సలు నచ్చదు. శారీరక దూరం..పార్ట్‌నర్స్ ఒకరికొకరు శారీరకంగా దూరంగా ఉంటున్నా, ప్రేమను పంచుకోలేకపోతున్నా పురుషులు చాలా డిసప్పాయింట్ అవుతారు. ఈ లోటును తీర్చుకోవడానికి వేరొకరి వద్ద ఆ శారీరక అనుబంధాన్ని వెతుకుతారు. గొడవలు, ప్రతీకారం..ఒకరికొకరు గొడవ పడుతూ ఉండటం, సమస్యలను పరిష్కరించుకోకపోవడం వల్ల భార్యాభర్తలు, ప్రేమికుల మధ్య దూరం పెరుగుతుంది. ఈ సమస్యల నుంచి తప్పించుకోవడానికి కొంతమంది పురుషులు మోసం చేస్తారు. పార్ట్‌నర్ తమకు ద్రోహం చేశారని భావించినప్పుడు, కొంతమంది పురుషులు ప్రతీకారం తీర్చుకోవడానికి మోసం చేస్తారు. ఇది ఒక రకమైన ప్రతీకారం.