మన పల్స్ రేటు ఎంత ఉండాలి, తక్కువగా ఉంటే ఏ వ్యాధులు వస్తాయో తెలుసా..?

divyaamedia@gmail.com
2 Min Read

సాధారణంగా ఒక ఆరోగ్యకరమైన వ్యక్తి పల్స్ రేటు నిమిషానికి 60 నుంచి 100 బీట్ల వరకు ఉండవచ్చు. అథ్లెటిక్స్ అంటే క్రీడాకారులు పల్స్ రేట్ ఒక్కోసారి 60 బీట్లు కంటే తక్కువగా ఉంటుంది. ఇది సాధారణంగా ఆరోగ్యమనే చెబుతారు. అయితే పల్స్ రేటును కొన్ని అంశాలు ప్రభావితం చేస్తాయి. శారీరక శ్రమ, వయసు కాకుండా మరికొన్ని విషయాలు కూడా ఈ లిస్టులో ఉంటాయి. అవేంటంటే.. ఒత్తిడి :- తరచుగా ఒత్తిడి, ఆందోళన, ఎమోషన్స్‌కు గురవుతుంటే పల్స్‌పై ప్రభావం పడుతుంది. ఇలాంటి సందర్భాల్లో హృదయ స్పందన రేటు సాధారణంగా కంటే ఎక్కువగా ఉండవచ్చు.

బరువు:-అధిక బరువు కూడా పల్స్ రేటును పెంచుతుంది. ఎందుకంటే అధిక బరువు కారణంగా వివిధ భాగాలకు రక్తాన్ని సరఫరా చేయడానికి శరీరం మరింత కష్టపడాల్సి ఉంటుంది. ఇది ఒత్తిడిని కలగజేసి పల్స్ రేటు పెరుగుదలకు కారణమవుతుంది. రక్తహీనత :- శరీరంలో రక్తం తగిన స్థాయిలో లేకపోతే పల్స్ రేటు పెరుగుతుంది. ముఖ్యంగా ఎర్ర రక్తకణాలు తక్కువ స్థాయిలో ఉంటే రక్తాన్ని సరఫరా చేయడానికి గుండె ఎక్కువగా శ్రమించాల్సి ఉంటుంది. ఫలితంగా పల్స్ రేటు పెరిగిపోతుంది.

ఉష్ణోగ్రత :- అతి వేడి, అతి శీతల ఉష్ణోగ్రతలకు శరీరం గురైనప్పుడు పల్స్ రేటు ప్రభావితమవుతుంది. ఇది సాధారణం కంటే తగ్గడానికి లేదా పెరగడానికి అవకాశం ఉంటుంది. నొప్పి :- శరీరంలోని ఏదైనా భాగంలో నొప్పి ఉంటే అది ఒత్తిడి కలగజేస్తుంది. దాని కారణంగా పల్స్ రేటు పెరుగుతుంది. మందుల దుష్ప్రభావాలు :- కొన్ని రకాల మందులు వాడటం వల్ల పల్స్ రేటులో మార్పు ఉంటుంది. ముఖ్యంగా బీటా బ్లాకర్స్ వంటి మందుల వినియోగంతో పల్స్ రేటు తగ్గిపోతుంది. హార్మోన్స్ అసమతుల్యత :- శరీరంలో వివిధ రకాల హార్మోన్స్ అసాధారణంగా ఉంటే పల్స్ రేటపై ప్రభావం పడుతుంది.

స్మోకింగ్ :- పల్స్ రేటు పెరగడానికి ధూమపానం ఒక కారణం. అయితే ఈ చెడు అలవాటును క్రమంగా తగ్గించుకుంటే పల్స్ రేటు తిరిగి సాధారణ స్థితికి వస్తుంది. ఎలా మెజర్ చేస్తారు..నాడిని అంచనా వేయడానికి చూపుడు, మధ్య వేలును మెడ మీద ఉండే శ్వాసనాళంపై ఉంచాలి. మణికట్టు మీద బొటనవేలు ఉంచి పల్స్ తెలుసుకోవచ్చు. నాడీ కొట్టుకోవడం మీకు స్పర్శగా వినిపిస్తున్నప్పుడు 15 సెకన్లలో బీట్స్ సంఖ్యను లెక్కించాలి. నిమిషానికి బీట్‌లను లెక్కించడానికి ఈ సంఖ్యను నాలుగుతో గుణించాలి.

Share This Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *