హీరోయిన్ గా రాణించడం అంత సులభమేమీ కాదు. అందం, అభినయంతో పాటు కాసింత అదృష్టం కూడా కావాలి. అలా అన్ని కలిసి వస్తే ఆఫర్స్ వస్తాయి. ఈ క్రమంలో నటించిన మూవీకి హిట్ టాక్ వస్తే స్టార్ హీరోయిన్ గా ఇండస్ట్రీలో నిలుస్తారు. అయితే తొలి సినిమాతోనే తెలుగు ప్రేక్షకుల మనసు దోచేసింది. ఆతర్వాత వరుసగా సినిమాలు చేసి ఆకట్టుకుంది అంతే కాదు నిత్యామీనన్ సింగర్ గాను తన ప్రతిభ చాటుకుంది. సినిమాల్లో కొన్ని పాటలను కూడా ఆలపించింది ఈ అమ్మడు.
నిత్యా తెలుగుతో పాటు తమిళ్ లోనూ సినిమాలు చేస్తూ ప్రేక్షకులను మెప్పిస్తుంది. నిత్యామీనన్ కన్నడ, తమిళ, మలయాళ భాషలలో సుమారు యాభై చిత్రాలకు పైగా నటించింది. ఇక తెలుగులో అలా మొదలైంది తర్వాత సెగ, 180 వంటి చిత్రాలు చేసినా అవి పెద్దగా ఆకట్టుకోలేకపోయాయి. ఆతర్వాత నితిన్ హీరోగా నటించిన ఇష్క్ సినిమాతో హిట్ అందుకుంది. ఆతర్వాత మళ్లీ నితిన్‌తో జతకట్టిన గుండెజారి గల్లంతయ్యిందే సినిమాతో మరో హిట్ అందుకుంది.
ఇక తెలుగు, తమిళ్ భాషల్లో సినిమాలు చేస్తూ ఆకట్టుకుంటుంది. కాగా తెలుగులో చివరిగా పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన భీమ్లానాయక్ సినిమాలో మెరిసింది. ఇదిలా ఉంటే తాజాగా నిత్యామీనన్ జాతీయ అవార్డును సొంతం చేసుకుంది. ధనుష్ తో కలిసి ఆమె నటించిన తిరు సినిమాకు గాను ఉత్తమ నటిగా నిత్యా అవార్డు అందుకుంది. అయితే తాజాగా నిత్యామీనన్ పెళ్ళికి సంబందించిన వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
కోలీవుడ్ నుంచి వినిపిస్తున్న టాక్ ప్రకారం తమిళ్ స్టార్ హీరోను నిత్యామీనన్ పెళ్లి చేసుకోనుందని అంటున్నారు. గతంలోనూ నిత్యామీనన్ పెళ్లి గురించి వార్తలు వచ్చాయి. తాజాగా మరోసారి నిత్యం మీనన్ పెళ్లి టాపిక్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. త్వరలోనే నిత్యా పెళ్లి గురించి అఫీషియల్ అనౌన్స్ మెంట్ కూడా ఇవ్వనున్నారని అంటున్నారు. ఇంతకూ ఆ స్టార్ హీరో ఎవరు అనేది మాత్రం తెలియడం లేదు. మరి ఈ వార్తల్లో వాస్తవమెంత అన్నది తెలియాల్సి ఉంది.