ఇదేం పనిరా..! పెళ్లైన 3 నిమిషాలకే భర్తకు విడాకులు ఇచ్చిన భార్య, అసలు ఏం జరిగిందో తెలిస్తే..?

divyaamedia@gmail.com
1 Min Read

వివాహం అనగా సమాజంలో ఇద్దరు భాగస్వామ్యుల మధ్య హక్కులు, బాధ్యతలను స్థాపించే ఒక చట్టబద్ధమైన ఒప్పందం. వివాహం నిర్వచనం వివిధ సంస్కృతుల ప్రకారం మారుతుంది,కానీ ప్రధానంగా వ్యక్తుల మధ్య సంబంధాలలో,సాధారణంగా సన్నిహిత, లైంగిక సంబంధాలలో సంతరించుకున్న వ్యవస్థ. కొన్ని సంస్కృతులలో వివాహం ఒక సిఫార్సు లేదా ఇద్దరు భాగస్వామ్యుల మధ్య లైంగిక సంబంధానికి ముందు తప్పనిసరిగా చేసుకొనే ఒప్పందం.

విస్తారంగా వివరించుటకు వివాహం అనేది ఒక సాంస్కృతికంగా సార్వజనీనమైన కార్యం. అయితే దుబాయ్ యువరాణి షైఖా మహరా తన భర్తకు ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా విడాకులిచ్చిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు అలాంటి ఘటనే ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అయితే ఇక్కడొక యువతి పెళ్లయిన మూడు నిమిషాల్లోనే కళ్యాణ మండపంలో భర్తకు విడాకులు ఇచ్చింది.

ఈ ఘటన కువైట్‌లో జరిగింది. ఆ వివరాలు ఇలా.. వివాహ వేడుకలో తంతు జరుగుతుండగా.. వధువు పొరపాటున స్లిప్ అయ్యి పడిపోయింది. ఆ సమయంలో వరుడు, అతడి కుటుంబసభ్యులు ఆమెను అవమానించారు. దీంతో అసహనానికి గురైన యువతి.. అదే హాలులో భర్తకు పెళ్లైన మూడు నిమిషాలకే విడాకులు ఇచ్చింది.

ఇస్లామిక్ చట్టంలో, తక్షణ విడాకుల ప్రక్రియను “తలాక్-ఎ-బిద్దత్” అని అంటారు. అక్కడ భర్త వివాహాన్ని రద్దు చేసుకోవడానికి మూడుసార్లు “తలాక్” చెప్తాడు. అయితే ఈ మధ్యకాలంలో భార్యలు తలాక్ ఇచ్చే సంఘటనలు ఎక్కువైపోయాయి. ప్రస్తుతం, ఈ మూడు నిమిషాల విడాకుల ఘటన ఇంటర్నెట్‌లో తెగ చక్కర్లు కొడుతోంది.

Share This Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *