నుపుర్ సనన్ గురించి ప్రత్యేక పరిచకం అక్కర్లేదు. టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కృతి సనన్‌కు సొంత చెల్లెలు. అక్క అడుగుజాడల్లోనే సినీ రంగంలోకి అడుగుపెట్టిన నుపుర్.. తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకునే ప్రయత్నంలో ఉంది. ముఖ్యంగా టాలీవుడ్‌లో రవితేజ హీరోగా నటించిన ‘టైగర్ నాగేశ్వరరావు’ సినిమాలో కీలక పాత్రలో నటించి తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యారు.
ఆ సినిమాతో ఆమెకు మంచి గుర్తింపు రావడంతో పాటు, నటిగా తన సత్తా చూపించే అవకాశం దక్కింది. అయితే గత వారమే వీరిద్దరి ఎంగేజ్మెంట్ వేడుక ఘనంగా జరగ్గా.. ఇప్పుడు రాజస్థాన్ లోని అందమైన నగరం ఉదయ్ పూర్ లో వీరిద్దరు ఏడడుగులు వేశారు. ఈ వేడుకకు కుటుంబసభ్యులు, అత్యంత సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు. సంప్రదాయబద్దమైన వాతావరణంలో జరిగిన ఈ వేడుకకు ఇరువురి కుటుంబాల ఆశీస్సులు లభించాయి.
ప్రస్తుతం వీరిద్దరి పెళ్లికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ మారింది. దీంతో ఈ జంటకు అభిమానులు, సన్నిహితులు, సినీప్రముఖులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. నుపుర్ సనన్ కెరీర్ విషయానికి వస్తే.. టాలీవుడ్ టాప్ హీరోయిన్ కృతి సనన్ కు ఆమె చెల్లెలు. అక్క అడుగుజాడల్లోనే సినీరంగంలోకి అడుగుపెట్టిన నుపుర్.. ఇప్పుడిప్పుడు మంచి గుర్తింపు తెచ్చుకుంటుంది. రవితేజ నటించిన టైగర్ నాగేశ్వరరావు సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది.
ఈ సినిమాతో గుర్తింపు వచ్చింది. కానీ ఆశించిన స్థాయిలో అంతగా అవకాశాలు రాలేదు. అలాగే ఇప్పుడిప్పుడే హిందీ సినిమా ప్రపంచంలో అవకాశాలు అందుకుంటుంది. ఇదిలా ఉంటే.. సింగర్ స్టెబిన్ బెన్ బాలీవుడ్ సంగీత ప్రపంచంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. హిందీలో పలు చిత్రాలకు సంగీతం అందించడమే కాకుండా ప్రైవేట్ ఆల్బమ్స్ చేస్తూ ఫేమస్ అయ్యాడు.
Finally its here ✨
— G (@kixtr1KSanon) January 10, 2026
5 years of love and a start to forever 🫶🏻#StebiNupurOnLoop #StebinBen#NupurSanon#KritiSanon pic.twitter.com/WhlvX3UuzJ
