సమంతతో ఉన్న చివరి జ్ఞాపకాన్ని కూడా చెరిపేసిన నాగ చైతన్య, శోభితతో పెళ్లి ముహూర్తం ఫిక్స్‌.

divyaamedia@gmail.com
2 Min Read

సమంత నాగచైతన్య ఎంత క్యూట్ కపుల్ అన్న విషయం మన తెలుగు అభిమానులతో పాటు..బాలీవుడ్ కోలీవుడ్ వాళ్లకు కూడా బాగా తెలుసు. వీరిద్దరు పెళ్లి అనగానే.. ఎగిరి గంతేసిన అభిమానులంతా… విడాకులు అనగానే అంతే బాధతో రియాక్ట్ అయ్యారు.విడాకులు తీసుకోవద్దంటూ.. అభిమానులు గగ్గోలు పెట్టారు. అయితే ఈ ఏడాది డిసెంబర్ లోనే నాగ చైతన్య, శోభితలు మూడు ముళ్ల బంధంలోకి అడుగు పెట్టనున్నట్లు తెలుస్తోంది.

ఈ క్రమంలోనే ఎంగేజ్ మెంట్ తర్వాత తమ సినిమా పనుల్లో బిజీ అయిపోయిన ఈ లవ్ బర్డ్స్ తొలిసారిగా జంటగా కనిపించారు. ఇక శోభిత ఇంట్లోనూ పసుపు దంచే కార్యక్రమం కూడా అట్టహాసంగా జరిగింది. దీనికి సంబంధించిన ఫొటోలను కూడా సోషల్ మీడియాలో షేర్ చేసింది శోభిత. దీంతో ఆ ఫోటోలు నెట్టింట బాగా వైరల్‌గా మారాయి. కాగా సామ్ తో విడాకుల అనంతరం ఆమెతో ఉన్న జ్ఞాపకాలను చెరిపేశాడు నాగ చైతన్య. తన సోషల్ మీడియా ఖాతాల్లో సామ్ తో కలిసున్న ఫొటోలన్నింటినీ డిలీట్ చేశాడు.

అయితే ఒక్క ఫొటో మాత్రం డిలీట్ చేయకుండా అలాగే వదిలేశాడు. అందులో విడాకులకు సంబంధించిన పోస్ట్ తో పాటు 2018లో మజిలీ సినిమాకు సంబంధించిన పోస్టర్ కూడా ఉన్నాయి. అంతేకాకుండా సమంతతో కలిసి రేస్ ట్రాక్‌పై తీసిన ఫొటో కూడా ఉంది. దీనికి ‘బ్యాక్ త్రో …మిసెస్ అండ్ ది గర్ల్‌ఫ్రెండ్’ అని క్యాప్షన్‌ ఉంది. అయితే తాజాగా ఆ ఫోటోను కూడా నాగ చైతన్య తన ఇన్‌స్టా గ్రామ్ అకౌంట్ నుంచి తొలగించినట్లు తెలుస్తోంది.

శోభితతో ఎంగేజ్‌మెంట్ తర్వాత కూడా ఈ ఫొటోను అలాగే ఉంచడంతో సమంత అభిమానులు ఫీలయ్యారు. వెంటనే ఈ ఫొటోను కూడా డిలీట్ చేయాలంటూ చైతన్యను కోరారు. ఈ క్రమంలోనే నాగ చైతన్య సమంత ఫొటోను, పోస్ట్ ను తొలగించినట్లు తెలుస్తోంది.

Share This Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *