పెళ్ళిలో అందంగా కనపడటానికి అంబానీ కొత్త కోడలు రాధిక ఏం చేస్తుందో తెలుసా..?

divyaamedia@gmail.com
2 Min Read

ముకేశ్ అంబానీ, నీతా అంబానీల చిన్న కుమారుడు అనంత్‌ అంబానీకి పెళ్లి నిశ్చయమైన విషయం అందరికీ తెలిసిందే. అయితే రాధిక.. తన దుస్తులు, జ్యువెలరీ విషయంలో ఎంత జాగ్రత్తలు తీసుకుంటుందో… తన లుక్స్ అందంగా కనపడేందుకు కూడా అంతే జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటుంది. పెళ్లిలో రాధిక ఏ డ్రెస్ వేసినా… ఆ డ్రెస్ కే అందాన్ని తెచ్చేలా కనపడింది. మనం ఎంత గొప్ప, కాస్ట్ లీ దుస్తులు, జ్యువెలరీ ధరించినా.. ముఖంలో కళ, కాంతి లేకపోతే… అందం రాదు. అందుకే.. ఆ కళ పెంచుకోవడానికి రాధిక ప్రయత్నిస్తుందట.

తన స్కిన్ ఫ్లా లెస్ గా ఉండేందుకు జాగ్రత్తపడుతుందట. అంటే.. ఎక్కువగా స్కిన్ కేర్ విషయంలో జాగ్రత్తపడుతుంది. రెగ్యులర్ గా స్కిన్ కేర్ రొటీన్ ఫాలో అవుతుందట. స్కిన్ ఫ్లాలెస్ గా ఉన్నప్పుడే… ఎలాంటి మేకప్ వేసుకున్నా.. చక్కగా నప్పుతుంది. రాధిక ఇదే సీక్రెట్ ఫాలో అవుతుందట. అంతేకాదు.. తాను ఏ దుస్తులు వేసుకున్నా.. జ్యూవెలరీ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంది. నార్మల్ గా.. ఏవి పడితే అవి కాకుండా.. స్టేట్మెంట్ పీసెస్, అదేవిధంగా తమ సంప్రదాయానికి సూటయ్యేలాంటి జ్యూవెలరీ ఎంచుకుంది. తన దుస్తులకు.. లగ్జరీ లుక్ తెచ్చేలా ఆమె జ్యవెలరీ ఎంచుకున్నారు.

అందుకే.. అంత ఎలిగెంట్ గా కనపడటం విశేషం. అనంత్- రాధిక పెళ్లి ఒక్క రోజులో పూర్తవ్వలేదు. చాలా రకాల ఫంక్షన్లు చేశారు. అన్ని ఫంక్షన్లలోనూ ఆమె తనకు కరెక్ట్ గా సూటయ్యేలా మేకప్ ని ఎంచుకున్నారు. చాలా సాఫ్ట్ మేకప్ , లైట్ ఐషాడోస్, రోజీ చీక్స్, పేస్టల్ లిప్ స్టిక్స్ ఎంచుకుంది. వీటి కారణంగా ఆమె హెవీ మేకప్ వేసుకున్నట్లుగా కాకుండా… చాలా సహజంగా అందంగా కనపడింది. ఇక.. ఈ రోజుల్లో ఎక్కువమంది అందంగా కనపడటానికి హెయిర్ లూస్ గా వదిలేస్తూ ఉంటారు. కానీ.. రాధిక మాత్రం.. తన హెయిర్ విషయంలోనూ ప్రతి పెళ్లి ఈవెంట్ లో చాలా జాగ్రత్తలు తీసుకుంది.

వేసుకున్న డ్రెస్ కి సెట్ అయ్యేలా.. హెయిర్ యాక్ససరీస్ కూడా ఎంచుకుంది. పూల దగ్గర నుంచి.. జ్యూవెలరీ పీసెస్ వరకు.. ఆమె అందానికి.. అదనపు ఆకర్షణగా నిలిచాయి. ఇక.. తాను ఎంచుకునే రంగులు కూడా ఆమెను చాలా స్పెషల్ గా నిలిచేలా చేశాయి. ముఖ్యంగా హల్దీ వేడుకలో ఆమె వేసుకున్న లెహంగాకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉందని చెప్పొచ్చు. ఒక్క హల్దీనే కాదు.. ఆమె దాదాపు ఎంచుకున్న రంగులన్నీ.. కాస్త భిన్నంగా ఉండేలా చూసుకుంది. అందుకే.. అంత ఎట్రాక్టివ్ గా కనపడింది.

Share This Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *