2016లో ఆమె పడిన కష్టం వృథా కాలేదు. 2017లో ఫెమినా మిస్ ఇండియా టైటిల్ గెలుచుకుని, ఆ తర్వాత 17 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత భారత్‌కు ప్రపంచ సుందరి కిరీటాన్ని అందించారు. ఆమె కంటే ముందు 2000లో ప్రియాంక చోప్రా ఈ ఘనత సాధించారు. అయితే మాజీ ప్రపంచ సుందరి, నటి మానుషి చిల్లర్. తాజాగా తన పాత జ్ఞాపకాలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకున్నారు.
“2026 ఈజ్ ది న్యూ 2016” అనే ట్రెండ్ లో భాగంగా ఆమె తన 2016 నాటి మెడికల్ కాలేజీ రిపోర్ట్ కార్డును అభిమానులతో పంచుకున్నారు. ఆ సంవత్సరం తన జీవితంలో ఎంతో ప్రత్యేకమైనదని.. ఒకేసారి ఎంబీబీఎస్ చదువు.. మిస్ ఇండియా పోటీల మధ్య నలిగిపోయానని గుర్తుచేసుకున్నారు.
ఢిల్లీలోని ఎయిమ్స్ కాలేజీలో చదువుతున్నప్పుడే తనను మిస్ ఇండియా నిర్వాహకులు గుర్తించారని తెలిపింది. క్లాసులు అయిపోగానే శనివారం పోటీల కోసం తీసుకున్న ఫస్ట్ ఫోటోస్ అని అన్నారు. అటు చదువుకుంటూనే ఇటు యాడ్ క్యాంపెయిన్ చేశానని.. సర్జరీ విభాగంలో మొదటి క్లినికల్ పోస్టింగ్ కూడా అప్పుడే జరిగిందని తెలిపారు.
కేవలం మిస్ ఇండియా పోటీల కోసమే ఇన్ స్టాలోకి అడుగుపెట్టానని.. పదేళ్ల తర్వాత కూడా ఇక్కడే ఉండిపోయానని అన్నారు. 2017లో ఫెమినా మిస్ ఇండియా టైటిల్ గెలుచుకుంది. ఆ త్రవాత 17 ఏళ్ల సుధీర్ఘ విరామం తర్వాత భారత్ కు ప్రపంచ సుందరి కిరీటాన్ని అందించారు. మానుషి చిల్లర్ హిందీ, తెలుగు భాషలలో పలు చిత్రాల్లో నటించింది. కానీ ఈ బ్యూటీ ఇప్పటివరకు సరైన బ్రేక్ మాత్రం అందుకోలేకపోయింది.
