ఈ ప్రమాదంలో మను భాకర్ అమ్మమ్మ, మేనమామ మృతి చెందారు. ఇటీవలే రాష్ట్రపతి చేతుల మీదుగా ఖేల్ రత్న అవార్డును అందుకున్న ఆమెకు ఈ విషాద సంఘటన చేదుని మిగిల్చింది. వీరు స్కూటీపై ప్రయాణిస్తుండగా బ్రేజ్జా కారు వారిని ఢీ కొట్టినట్లు పోలీసులు తెలిపారు. అయితే మను భాకర్ మామ, అమ్మమ్మ ఇద్దరూ స్కూటీపై ప్రయాణిస్తుండగా అకస్మాత్తుగా కారు వారిని ఢీకొట్టింది. దీంతో వారు ఇద్దరూ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.
ప్రమాదం జరిగిన మరుక్షణమే కారు డ్రైవర్ ఘటనా స్థలం నుంచి పరారయ్యాడు. మను భాకర్ మామ యుద్ధవీర్ సింగ్ రోడ్‌వేస్‌లో డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. అతని ఇల్లు మహేంద్రగడ్డ బైపాస్‌లో ఉంది. ఎప్పటిలాగే ఇవాళ కూడా పని నిమిత్తం ఇంటి నుంచి బయలుదేరాడు. అదే సమయంలో మను అమ్మమ్మ సావిత్రి దేవి లోహారు చౌక్‌లోని తన చిన్న కొడుకు ఇంటికి వెళ్లాలనుకుంది. దాంతో యుధ్వీర్ తన తల్లిని బైక్ ఎక్కించమని కోరగా, ఇద్దరూ కలిసి బయలు దేరారు.
ను భాకర్ మేనమామ ద్విచక్ర వాహనంపై కలియానా మలుపు దగ్గరకు వచ్చారు. అదే సమయంలో ముందు నుంచి అతివేగంతో వస్తున్న కారు వీరిని ఢీకొట్టింది. దీంతో యుధ్వీర్ సింగ్, సావిత్రి దేవి రోడ్డుపై పడి పోయారు. రక్తస్రావం ఎక్కువ కావడంతో ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. మరోవైపు వేగంగా వెళ్తున్న కారు రోడ్డు పక్కన బోల్తా పడింది. ఘటన అనంతరం కారు డ్రైవర్ అక్కడి నుంచి పరారయ్యాడు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకున్నారు.
అనంతరం పోలీసులు మనుభాకర్ మామ, అమ్మమ్మ మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. అలాగే, ప్రస్తుతం ఘటనపై పోలీసులు విచారణ జరుపుతూ నిందితుల కోసం గాలిస్తున్నారు. మను భాకర్ రెండు రోజుల క్రితం రాష్ట్రపతి చేతుల మీదుగా ఖేల్ రత్న అవార్డును అందుకున్నారు. అంతలోనే ఈ విషాద ఘటన చోటు చేసుకుంది.
VIDEO | Haryana: International shooting star Manu Bhaker's maternal grandmother and maternal uncle die in a accident in Charkhi Dadri.
— Press Trust of India (@PTI_News) January 19, 2025
ASI Suresh Kumar informs, "We got the information about the accident about a collision of a car and a scooty. Both the persons on the scooty… pic.twitter.com/U6wFpgiVaz