సింగర్ మంగ్లీ బర్త్ డే పార్టీలో ఆ స్టార్ నటి కూడా ఉందా..? పోలీసులు ఏం చెప్పారంటే..?

divyaamedia@gmail.com
2 Min Read

‘రాత్రి దాదాపు ఒంటిగంట సమయంలో రిసార్ట్ పై ఫిర్యాదు వచ్చింది. రిసార్టులో పెద్దపెద్ద సౌండ్ చేస్తూ హంగామా చేస్తున్నారంటూ ఫిర్యాదు అందింది. పెద్ద ఎత్తున డీజే పెట్టారంటూ కంట్రోల్ రూమ్ కి స్థానికులు ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత స్థానిక పోలీసుల ఫిర్యాదుతో మహిళా ఎస్సై త్రిపుర రిసార్ట్ కి వెళ్లింది. అక్కడ పదిమంది మహిళలు 12 మంది పురుషులు కలిసి డీజే పెట్టి హంగామా చేస్తున్నట్లు గుర్తించాం. అందరూ కూడా మధ్యమత్తులో ఉండి డాన్సులు చేస్తున్నట్లు గుర్తించాం’ ‘మంగ్లీ బర్త్ డే పార్టీ జరుగుతున్నట్లుగా అక్కడ ఉన్న మేనేజర్ చెప్పాడు.

అలాగే బర్త్ డే పార్టీకి ఎలాంటి పర్మిషన్ తీసుకోలేదని మేనేజర్ తెలిపారు. అయితే ఈ బర్త్ డే పార్టీకి ప్రముఖ నటి, బిగ్ బాస్ ఫేమ్ దివి వైద్య కూడా హాజరైంది. దీంతో ఇప్పుడు సోషల్ మీడియాలో ఈ ముద్దుగుమ్మ పేరు కూడా మార్మోగిపోతోంది. తాజాగా ఈ వ్యవహారంపై ఆమెనే స్వయంగా స్పందించింది. ఈ మేరకు ఇన్ స్టా స్టోరీస్ లో ఒక వీడియో ను రిలీజ్ చేసింది. ‘ స్నేహితురాలి పుట్టిన రోజు పార్టీ అని వెళ్లాను. అలాగనీ అక్కడ జరిగిన తప్పులన్నింటినీ నాపైన మోపడంసరికాదు. నేను నిజంగా తప్పు చేసి ఉంటే, అందుకు మీ దగ్గర తగిన ఆధారాలు, సాక్ష్యాలు ఉంటే సోషల్ మీడియాలో నా ఫొటో పెట్టండి..

కానీ ఎలాంటి ఆధారం లేకుండా నా ఫొటో వాడి నన్ను నెగెటివ్‌ చేయకండి. దీని వల్ల నా కెరీర్‌కు చాలా ఇబ్బంది అవుతుంది’ ‘నేను ఎంతో కష్టపడి ఇంత దూరం వచ్చాను. ఫ్రెండ్‌ బర్త్‌డే అంటే ఎవరైనా వెళ్తారు. అలాగే, నేను కూడా ఆ అమ్మాయి నా స్నేహితురాలని అక్కడకు వెళ్లాను. అక్కడ జరిగిన పరిస్థితులకు నేను కారణం అన్నట్లుగా ఇప్పుడు నా ఫొటో లు వేస్తున్నారు. మీ ఫ్రెండ్‌ పుట్టినరోజు వేడుకల్లో ఏదైనా పొరపాటు జరిగితే మీరు బాధ్యత వహిస్తారా? కాదు కదా.. దయచేసి నా ఫొటోలు వాడకండి. నాకు, నా కెరీర్ కు చాలా ఇబ్బంది అవుతుంది.

హీరో, విలన్‌ కొట్టుకుని మధ్యలో కమెడియను చంపేసినట్లు ఏంటండి ఇది. మంగ్లీ బర్త్‌డే పార్టీకి వెళ్లానే తప్ప అక్కడ జరిగిన పరిణామాలకు, నాకు ఎటువంటి సంబంధం లేదు’ అని క్లారిటీ ఇచ్చింది దివి. కాగా ఈ మధ్యన సినిమాలతోనూ బిజి బిజీగా ఉంటోంది బిగ్ బాస్ బ్యూటీ. ఇప్పుడు డ్రగ్స్ కేసులో ఆమె పేరు రావడంతో ఇలా వీడియో రిలీజ్ చేసి క్లారిటీ ఇచ్చింది.

Share This Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *