పెళ్లి తర్వాత మంచు లక్ష్మీ భర్తకు దూరంగా ఉంటుందని కామెంట్స్ వినిపిస్తున్నాయి. కొన్ని ట్రోల్స్ కూడా వచ్చాయి. కానీ ఎప్పుడు లక్ష్మీ ప్రసన్న తన పెళ్లి గురించి ఎక్కడ స్పందించలేదు. అయితే సినిమా ఇండస్ట్రీలో మంచు లక్ష్మీ స్పెషల్ ఇమేజ్ సొంతం చేసుకున్నారు. చైల్డ్ ఆర్టిస్ట్ గానే కెరీర్ ను ప్రారంభించిన లక్ష్మి ఇప్పటి వరకు అన్నీ కలిసి 20 ఫీచర్ ఫిల్మ్స్ లో నటించింది. అనగనగా ఓ ధీరుడు సినిమాలో విలన్ గా నటించి మెప్పించింది.
అలాగే పలు సినిమాల్లో స్పెషల్ రోల్స్ చేసి ఆకట్టుకుంది. నిర్మాతగానూ చెప్పుకోదగ్గ సినిమాలు చేసింది. అయితే లక్ష్మీ ప్రసన్న పెళ్లి గురించి నెటిజన్స్ ఎప్పటికప్పుడు చర్చించుకుంటున్నారు. పెళ్లి తర్వాత మంచు లక్ష్మీ భర్తకు దూరంగా ఉంటుందని కామెంట్స్ వినిపిస్తున్నాయి. కొన్ని ట్రోల్స్ కూడా వచ్చాయి. కానీ ఎప్పుడు లక్ష్మీ ప్రసన్న తన పెళ్లి గురించి ఎక్కడ స్పందించలేదు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మంచు లక్ష్మీ తన పెళ్లి గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.
మంచు లక్ష్మి భర్త పేరు ఆండీ శ్రీనివాసన్. ఆయన ఫారేన్ లో ఐటీ ప్రొఫెషనల్ గా వర్క్ చేస్తున్నారు. తాజాగా మంచు లక్ష్మీ తన భర్త గురించి మాట్లాడుతూ.. తాము ఎంతో అన్యోన్యంగా ఉంటామని తెలిపింది అలాగే.. సమాజంలో ప్రశాంతంగా బతికేలా, స్వేచ్ఛను ఇచ్చిపుచ్చుకుంటామని తెలిపింది. న్యూక్లియర్ ఫ్యామిలీ స్ట్రక్చర్ లో జీవిస్తామని చెప్పింది. స్వేచ్ఛ, ప్రైవసీ, పర్సనల్ రెస్పాన్సిబిటీ లకు ప్రాధాన్యత ఇస్తామని తెలిపింది.
మాకు ఎలా అనిపిస్తే అలా బతుకుతున్నామని తెలిపింది మంచు లక్ష్మీ. జనాలు ఏమనుకుంటారో అని ఆలోచిస్తూ.. మా పీస్‌ను కోల్పోము అని తెలిపింది. తన భర్తతో కలిసి ఉంటున్నా అని తెలిపింది ఇటీవలే రెండు నెలలు తన భర్తతో కలిసి ఉన్నానని, అలాగే తన కూతురు ఇప్పుడు భర్త దగ్గర ఉందని కూడా తెలిపింది.