తిరుపతిలో మోహన్ బాబు విద్యానికేతన్ స్కూల్ లో ప్రతి సంవత్సరం మంచు ఫ్యామిలీ సంక్రాంతి సెలబ్రేషన్స్ జరుపుకుంటారు. ఈ సంవత్సరం కూడా అలాగే జరుపుకుంటున్నారు. అయితే మంచు మనోజ్ నేడు స్కూల్ వద్దకు వస్తున్నాడని తెలిసి పోలీసులను సెక్యూరిటీ పెట్టారు. అయితే మంచు కుటుంబం మధ్య ఇటీవల చోటుచేసుకున్న వివాదాల నేపథ్యంలో మంచు మనోజ్ యూనివర్సిటీలోకి వస్తే సమస్యలు తలెత్తవచ్చన్న ఉద్దేశంతో సెక్యూరిటీ సిబ్బంది ఆయనను అనుమతించలేదు. తాను గొడవ కోసం రాలేదని, యూనివర్సిటీ ఆవరణలో తన తాత నారాయణస్వామి నాయుడు, నానమ్మ లక్ష్మమ్మల సమాధుల వద్ద నివాళులర్పించేందుకు మాత్రమే వచ్చానని మనోజ్ చెప్పినప్పటికీ, సెక్యూరిటీ సిబ్బంది పట్టించుకోలేదు.
ఈ వ్యవహారంపై మనోజ్ గేటు వద్ద ఆందోళనకు దిగారు. ఆ సమయంలో లోపల ఉన్న వ్యక్తిని ఉద్దేశించి, “ఓరేయ్ ఎలుగుబంటి, గేట్ తీయ్!” అంటూ డిమాండ్ చేశారు. పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారకుండా స్థానిక పోలీసులు అక్కడికి చేరుకున్నారు. ఈ సమయంలో మోహన్ బాబు బౌన్సర్లు, మనోజ్ బౌన్సర్లు వివాదానికి దిగారు. దీంతో ఒకరిపై ఒకరు దాడి చేసుకుంటుండంతో పోలీసులు వారిపై లాఠీఛార్జ్ చేశారు. అనంతరం పోలీసుల సహాయంతో తన భార్యతో కలిసి మనోజ్.. అవ్వ తాత సమాధులకు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మనోజ్ కీలక వ్యాఖ్యలు చేశారు.
‘ఫ్యామిలీలో గొడవలు, కాలేజీలోకి రానివ్వక పోవడం వంటి ఘటనలు ఎందుకు జరుగుతున్నాయి తెలియడం లేదు. ఈ సమస్యలకు పరిస్కారం ఉంటే బాగున్ను, కచ్చితంగా పరిస్కారం కనుకుంటా. విద్యార్థులు, స్థానికులు, ప్రైవేట్ హాస్టళ్లపై జరిగే అన్యాయాలపై ప్రశ్నిస్తే దూరం పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. హైదరాబాద్ ఇంట్లోకి రానివ్వకపోవడం, మా అమ్మ పుట్టినరోజు నాడు నా ఇంట్లో జనరేటర్ లో చక్కర పోశారు. బ్రెయిన్ వాష్ చేసి ఏమీ తెలియని మా అమ్మ వద్ద సంతకం పెట్టించారు. నా అభిమానులు కాలేజీ వద్ద ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను సైతం తొలగించే స్థితికి దిగజారారు.
గొడవలు వద్దు అని అభిమానులకు చెప్పా.. మొదటి సారి తొలగించిన అనంతరం నేను వస్తున్న అని తెలిసి మళ్లీ అభిమానులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఈ రోజు పనిగట్టుకుని మళ్లీ పెట్టిన ఫ్లెక్సీలను ఓ ట్రాక్టర్ ద్వారా తొలగించారు. పోలీసుల లాఠీలను రౌడీలు పట్టుకొని తిరుగుతున్నారు. ట్రస్ట్ సభ్యులు భయట నుంచి రౌడీలను తీసుకొచ్చి గొడవ పడుతున్నారు. పోలీసుల మాట విని తగ్గి వెనక్కి వెళ్తున్న… ఆ బౌన్సర్లను చూసి కాదు. ఈ ఘటనపై పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేస్తా.. లోకల్ వాళ్ళు అన్నా… అంటూ ఆప్యాయంగా పలకరిస్తారు. భయట నుంచి వచ్చిన రౌడీలు గోడ దూకి పారిపోయారు’ అంటూ మనోజ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.