మంచు ఫ్యామిలీలో మరో వివాదం తెరపైకి వచ్చింది. శనివారం తన కుటుంబంలో జరిగిన మరో ఘటన గురించి మనోజ్ ఒక ప్రకటన విడుదల చేశారు. మంచు విష్ణు తన ఇంటి వద్ద జనరేటర్‌లో పంచదార పోయించి, విద్యుత్తు సరఫరా నిలిపివేశారని ఆరోపించారు. అయితే మంచు ఫ్యామిలీని పోలీసు కేసులు ఇప్పట్లో వదిలేలా కనిపించడం లేదు. కూర్చొని పరిష్కరించుకోవాల్సిన విషయాలపై సినీ స్టార్స్ పోలీస్ స్టేషన్ మెట్లెక్కడంతో అవి ఇప్పుడు వాళ్ల పీకలకే చుట్టుకున్నాయి. చిన్న కొడుకు మనోజ్‌తో తనకు ప్రాణహాని ఉందని మోహన్ బాబు కంప్లైంట్ ఇస్తే .. కుటుంబ సభ్యులతో తన భార్య, పిల్లలకు థ్రెట్ ఉందని మనోజ్ రోడ్డెక్కాడు.
ఫైనల్‌గా ఈ మొత్తం వ్యవహారంలో మోహన్ బాబు ఓ జర్నలిస్టుపై దాడి చేయడంతో మొత్తం మోహన్ బాబు ఫ్యామిలీపై మూడు కేసులు నమోదైనట్లుగా రాచకొండ సీపీ సుధీర్ బాబు తెలిపారు.హత్యాయత్నంతో పాటు మరో రెండు కేసుల్లో ఎఫ్ఐఆర్ నమోదైందని ..అయితే అరెస్ట్ చేయడానికి కోర్టు ఉత్తర్వులు అడ్డొస్తున్నాయని తెలిపారు. ఈనెల 24 వరకు మోహన్ బాబు సరండర్ కాకపోతే తగిన చర్యలు తీసుకుంటామన్నారు. మరోవైపు మోహన్ బాబు రెండ్రోజుల క్రితమే లైసెన్సుడ్ గన్ చంద్రగిరి పోలీస్ స్టేషన్‌లో డిపాజిట్ చేశారు.
అయితే రాచకొండ పోలీసులు మాత్రం మోహన్ బాబు దగ్గర రెండు గన్స్ ఉన్నట్లుగా తమకు సమాచారం ఉందంటున్నారు. విలక్షణ నటుడు మంచు మోహన్ బాబుకి కొత్త చిక్కులు వచ్చి పడుతున్నాయి. ఫ్యామిలీలో నెలకున్న విభేదాల కారణంగా ఇప్పటికే మూడు కేసులు నమోదయ్యాయి. ఇప్పటికి మోహన్ బాబు కనిపించడం లేదని..పరారీలో ఉన్నారనే వార్తలు ప్రచారం కావడంతో ఆదివారం మోహన్ బాబు గాయపడ్డ జర్నలిస్టును కలిసి క్షమాపణ చెప్పారు. ఈనేపథ్యంలో రాచకొండ సీపీ ఆయన్ని అరెస్ట్ చేయకపోవడంపై వివరణ ఇచ్చారు.
మోహన్ బాబుపై ఈనెల 24 వరకు ఎలాంటి చర్యలు తీసుకోకూడదని హైకోర్టు ఉత్తర్వులు ఉన్నాయని అందుకే అరెస్ట్ చేయలేదని రాచకొండ సీపీ సుధీర్ బాబు తెలిపారు. ఇక మోహన్ బాబు దగ్గరున్న లైసెన్స్డ్ గన్ పర్మిషన్ రాచకొండ పరిధిలో లేదని ..కాకపోతే ఆయనకిచ్చిన నోటీసులో ఎక్కడైనా సరెండర్ చేయవచ్చని సీపీ తెలిపారు. మోహన్ బాబు ఫ్యామిలీ కేసులో విచారణ జరుగుతోందని అలాగే హైకోర్టు ఉత్తర్వులను గౌరవిస్తున్నామని అప్పటివరకు రెస్పాన్స్ కాకపోతే మరోసారి మోహన్ బాబుకు నోటీసులు జారీ చేస్తామని సుధీర్ బాబు తెలిపారు.
ఓవైపు మంచు ఫ్యామిలీపై నమోదైన కేసులు విచారణ జరుగుతుండగానే ..మోహన్ బాబు తన లైసెన్సుడ్ గన్ ను చంద్రగిరి పోలీస్ స్టేషన్లో రెండ్రోజుల క్రితమే డిపాజిట్ చేసినట్లుగా తెలుస్తోంది.తన పిఆర్వో ద్వారా మోహన్ బాబు తన డబుల్ బ్యారెల్ గన్‌ను పీఎస్‌లో అప్పగించినట్లుగా తెలుస్తోంది. ఏవైపు జర్నలిస్టుకు క్షమాపణ చెప్పిన మోహన్ బాబు తన ఫ్యామిలీపై నమోదైన మూడు కేసుల్లోంచి ఎలా బయటపడతారో అని అభిమానులు ఆందోళన చెందుతున్నారు.