ఈ స్టార్ హీరోయిన్ కెరీర్ పీక్స్ లో ఉండగా మాఫియా డాన్‌తో ఎఫైర్ పెట్టుకుంది, చివరికి సన్యాసం తీసుకుని..?

divyaamedia@gmail.com
1 Min Read

కాషాయ దుస్తులు ధరించి, మెడలో రుద్రాక్షతో, భుజానికి వేలాడుతున్న కుంకుమపువ్వుతో ఆమె నిజమైన సాధ్విగా మారిపోయింది. 25 ఏళ్ల తర్వాత ఇండియాకు వచ్చిన ఆమె ఇలా సాధ్విగా మారిపోవడం చూసి అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. అయితే 90వ దశకంలో తన అందంతో కుర్రాళ్లను కట్టిపడేసింది. ఆమె మమతా కులకర్ణి. బాలీవుడ్ లో ఎంతో మంది అభిమానుల హృదయాల్లో స్థానం సంపాదించుకుంది.

అయితే ఉన్నట్టుండి కనిపించకుండా పోవడంతో ఆమెపై చర్చ మొదలైంది. ఎట్టకేలకు 24 ఏళ్ల తర్వాత మమత భారత్‌కు తిరిగి వచ్చింది. ఇండియాకి తిరిగి వచ్చిన తర్వాత బాలీవుడ్‌లోకి అడుగుపెడతారా.? అనే ప్రశ్నలు ఎదురయ్యాయి. గతంలో ఓ ఇంటర్వ్యూలో ఈ హీరోయిన్ పలు విషయాలను వెల్లడించింది. దీంతో పాటు డ్రగ్స్ కేసు విషయాలు కూడా మాట్లాడింది.

భారతదేశం నుంచి వెళ్లిపోవడానికి గల కారణాన్ని మమత చెబుతూ.. ‘భారతదేశం నుంచి వెళ్లిపోవడానికి అతిపెద్ద కారణం ఆధ్యాత్మికత.. 1996లో నేను ఆధ్యాత్మికత వైపు మొగ్గు చూపాను, ఆ సమయంలో నేను గురు గగన్ గిరి మహరాజ్‌ను కలిశాను. ఆయనను కలిసిన తర్వాత నాకు ఆధ్యాత్మికతపై ఆసక్తి పెరిగింది. ‘బాలీవుడ్ నాకు కీర్తి, సంపదను ఇచ్చిందని నేను అంగీకరిస్తున్నాను. ఆ తర్వాత బాలీవుడ్ లో ఆదరణ కోల్పోయాను. నేను చాలా సంవత్సరాలు దుబాయ్‌లో ఉన్నాను.

12 ఏళ్లపాటు బ్రహ్మచారిగా ఉన్నాను. అలాగే ఆమె మాట్లాడుతూ.. ఇప్పుడు నేను సన్యాసిని. నాకు బాలీవుడ్‌పైనా, దేనిపైనా ఆసక్తి లేదు. మళ్లీ బాలీవుడ్‌లోకి అడుగుపెట్టే వయసు కూడా లేదు. నేను ఇప్పుడు ఆధ్యాత్మిక జీవితాన్ని గడపాలనుకుంటున్నాను. ప్రతి ఒక్కరికీ కనెక్ట్ అయ్యేలా ఆధ్యాత్మిక చర్చలలో పాల్గొనాలనుకుంటున్నాను.’ అని చెప్పుకొచ్చింది.

Share This Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *