చామకూర మల్లా రెడ్డి తెలంగాణాలో కార్మిక మరియు ఉపాధి మంత్రిగా పనిచేసిన భారతీయ రాజకీయ నాయకుడు, 2019 నుండి 2023 వరకు పదవీ బాధ్యతలు స్వీకరించారు. అతను మేడ్చల్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి శాసనసభ సభ్యుడు . ఆయన పిల్లలు మమతారెడ్డి, మహేందర్ రెడ్డి, మరియు డాక్టర్ భద్రారెడ్డి.
అయితే ఆయన ఏం చేసినా సమ్‌థింగ్ డిఫరెంట్ ఉంటుంది. జనాల అటెన్షన్ గ్రాబ్ చేయడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య. తనదైన శైలిలో పబ్లిక్‌లో స్టెప్పులెస్తూ ఆయన అభిమానుల్ని, కార్యకర్తల్ని ఉత్సహపరుస్తుంటారు. తాజాగా మల్లారెడ్డి కొడలు డాక్టర్ ప్రీతిరెడ్డి కూడా మామకు ఏ మాత్రం తక్కువ కాదని నిరూపించింది.
విద్యార్థులతో కలిసి స్టెప్పులేసి అందరిలోనూ జోష్ నింపింది. కాలేజ్‌లో జరిగిన ఓ ఈవెంట్‌లో ఆమె కాలా చష్మా పాటకు కాలు కదిపింది. చాలా ఈజ్‌తో ఆమె చేసిన డ్యాన్స్ మూవ్స్ నెక్ట్స్ లెవల్ అంతే. ఆ వీడియో ప్రజంట్ నెట్టింట వైరల్ అవుతోంది. ప్రీతిరెడ్డి మామకు తగ్గ కోడలు అని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
