బిగ్ షాక్, బిల్డింగ్‌ పైనుంచి దూకి స్టార్ హీరోయిన్ తండ్రి ఆత్మహత్య.

divyaamedia@gmail.com
2 Min Read

మలైకా అరోరా తండ్రి గత కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నట్టు తెలిసింది. ఘటన జరిగిన సమయంలో మలైకా అరోరా ఇంట్లో లేరు. ప్రస్తుతం పూణెలో ఉన్న ఆమె సమాచారం అందుకున్న వెంటనే ముంబైకి బయలుదేరారు. అయితే మలైకా అరోరా, అమృతా అరోరా తండ్రి అయిన అనీల్ అరోరా ఆత్మహత్య చేసుకున్నట్లు వచ్చిన వార్తలు బాలీవుడ్ ను షాక్ కు గురి చేశాయి. ఆరో అంతస్తు నుంచి అతడు దూకాడని, వెంటనే అతన్ని హాస్పిటల్ కు తీసుకెళ్లినా అప్పటికే మరణించినట్లు డాక్టర్లు చెప్పినట్లు పోలీసులు వెల్లడించారు.

అయితే అనీల్ అరోరా ఆత్మహత్య చేసుకోవడానికి కారణం ఏంటన్నది మాత్రం ఇంకా తెలియలేదు. మోడల్, నటి అయిన మలైకా అరోరాతోపాటు మరో నటి అమృతా అరోరా కూడా సునీల్ అరోరా కూతుళ్లే. అతడు చనిపోయిన విషయం తెలియగానే మలైకా మాజీ భర్త అర్బాజ్ ఖాన్ వెంటనే అక్కడికి వెళ్లాడు. మలైకా అరోరా తండ్రి అనీల్ అరోరా, ఆమె తల్లి జాయ్స్ పోలీకార్ప్ చాలా రోజుల కిందటే విడిపోయారు. అప్పటికి మలైకా వయసు 11 ఏళ్లు మాత్రమే. ఆ తర్వాత మలైకా తన తల్లి, చెల్లి అమృతతో కలిసి చెంబూర్ వెళ్లింది.

మలైకా తల్లి జాయ్స్ ఓ మలయాళీ క్రిస్టియన్. తండ్రి అనిల్ అరోరా పంజాబీ హిందు. గతంలో ఇండియన్ మర్చంట్ నేవీలో పని చేశాడు. అటు మలైకా చెల్లెలు అమృత అరోరా కూడా కొన్ని బాలీవుడ్ సినిమాల్లో నటించింది. ఆమె 2009లో వ్యాపారవేత్త షకీల్ లడక్ ను పెళ్లి చేసుకుంది. వాళ్లకు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. ఇక మలైకా కూడా బాలీవుడ్ నటుడు అర్బాజ్ ఖాన్ తో 19 ఏళ్లు కలిసి ఉన్న తర్వాత 2016లో విడిపోయిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఆమె అర్జున్ కపూర్ తోనూ రిలేషన్షిప్ లో ఉన్నా.. తర్వాత వీళ్ల జంట కూడా విడిపోయింది.

Share This Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *