గతంలో బాలీవుడ్ ప్రముఖ నటుడు రణబీర్ కపూర్‌తో కలిసి ఈ నటి సిగరెట్ పట్టుకుని దిగిన ఫొటోలు సోషల్ మీడియాలో దుమారం రేపిన విషయం తెలిసిందే. తాజాగా మహిరా ఈ ఇష్యూ గురించి ఇంటర్వ్యూలో మాట్లాడింది. ది లిటిల్ వైట్ డ్రెస్ అంటూ ఓ మీడియా వార్త రాసిందని.. అస్సలు ఏం జరుగుతుందో అప్పుడు అంతగా కనిపెట్టలేకపోయానని తెలిపింది.
అయితే కొన్నాళ్లుగా సినిమాలకు దూరంగా ఉన్న మహిరా ఖాన్.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. ఈ క్రమంలో గతంలో వైరల్ అయిన ఈ ఫోటో గురించి మరోసారి ప్రస్తావించింది. దీంతో ఇప్పుడు మరోసారి ఈ ఫోటో తెరపైకి వచ్చింది. గతంలో రణబీర్ కపూర్ తో కలిసి తాను సిగరెట్ తాగుతున్న ఫోటో బయటకు రావడంతో తన కెరీర్ పూర్తిగా ముగిసిపోయిందని అనుకున్నానని తెలిపింది. అలాగే పెళ్లై బిడ్డ జన్మించిన తర్వాత విడాకులు తీసుకోవడం.. బిడ్డను ఒంటరిగా పెంచడం.. ఒంటరిగా ఎక్కువ కాలం జీవించడం వంటి ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నానని తెలిపింది.
విదేశాల్లో పనిచేయడంపై కూడా బ్యాన్ చేశారని తెలిపింది. 2017లో మహిరా, రణబీర్ స్మోకింగ్ చేస్తున్న ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ ఫోటోలో ఇద్దరు న్యూయార్క్ వీధుల్లో పొగ తాగుతూ కనిపించారు. ఈ ఫోటో వైరల్‌గా మారిన వెంటనే అభిమానుల నుంచి రకరకాల రియాక్షన్స్ వచ్చాయి. అప్పట్లో వీరిద్దరు ప్రేమలో ఉన్నారనే వార్తలు తెగ వైరలయ్యాయి.