బిగ్‌బాస్‌లోకి దివ్వెల మాధురి, నా భార్య జోలికి రావొద్దు అంటూ దువ్వాడ శ్రీనివాస్ హెచ్చరిక.

divyaamedia@gmail.com
2 Min Read

దివ్వెల మాధురి.. ఎప్పుడు బిగ్‌బాస్ సీజన్ మొదలైనా ఖచ్చితంగా ఈవిడ బిగ్‌‌బాస్‌కి వెళ్తారని వార్తలు వస్తూనే ఉన్నాయి. తనకు బిగ్‌బాస్ నుంచి ఆఫర్లు వచ్చిన మాట నిజమేనని పలు ఇంటర్వ్యలలో మాధురి తెలిపారు. అయితే కుటుంబానికి, దువ్వాడ శ్రీనివాస్‌కు దూరంగా ఉండలేక ఆఫర్ తిరస్కరించినట్లు మాధురి చెప్పారు. కానీ ఈ సారి మాత్రం కనీసం వైల్డ్ కార్డ్ ద్వారా అయినా ఎంట్రీ ఇప్పించాలని బిగ్‌బాస్ టీమ్ గట్టిగా పట్టుకోవడంతో ఆమె ఓకే చెప్పేశారు.

దీంతో దివ్వెల మాధురి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఖరారైంది. అయితే గత నాలుగేళ్ల నుంచి మాత్రం శ్రీనివాస్ అంటే మాధురి, మాధురి అంటే శ్రీనివాస్‌గా జీవిస్తున్నాం. కానీ ప్రతిరోజూ సోషల్ మీడియాలో నా గురించి వస్తున్న కామెంట్స్ చూస్తుంటే చాలా ఇబ్బందిగా ఉంది. చివరికి నా కూతుళ్లను కూడా ట్రోల్ చేస్తున్నారు. జీవితంలో చాలా నెగెటివిటీని చూశాను. సమాజం ఒక వైపు, నేను మొత్తం ఒక వైపు అన్నట్లు సాగింది.

నా గురించి నిజం తెలుసుకుంటారనే ఉద్దేశంతోనే బిగ్ బాస్ హౌస్ లోకి అడుగు పెడుతున్నాను’ అని చెప్పుకొచ్చింది మాధురి. ఈ సందర్భంగా ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ లో ఎవరు బెస్ట్ అని నాగార్జున మాధురిని ప్రశ్నించగా ఇమ్మాన్యుయేల్ బెస్ట్ అని ఆన్సరిచ్చింది. ఇక మిగిలిన వాళ్లందరూ మాస్క్‌లు పెట్టుకుని ఉంటున్నారని చురకలు అంటించింది. కాగా మాధురికి గోల్డెన్ బజర్ పవర్ స్టోన్ ఇచ్చారు.

దీనిని ఉపయోగించి ఓ ఎలిమినేషన్‌ని రద్దు చేసే అవకాశముంది అని నాగార్జున చెప్పాడు. అయితే దీనిని ఎప్పుడు ఉపయోగించాలన్నది మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. తనపై ఉన్న నెగెటివిటీని పోగొట్టుకోవడానికే బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇస్తున్నానని మాధురి చెప్పుకొచ్చింది. మరి ఆమె లక్ష్యం ఏ మేర నెరవేరుతుందో చూడాలి.. లెట్స్ వెయిట్ అండ్ సీ.. అంతకు ముందు మాధురికి ఆల్ ద బెస్ట్ చెబుతూ ఓ వీడియోను రిలీజ్ చేశారు దువ్వాడ శ్రీనివాస్.

Share This Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *