ఆమె మొదటి సినిమా 2015 లో తమిళంలోని “సుందర్ సి”. ఆమె తెలుగులో మహేష్ బాబు కథానాయకునిగా విడుదలైన అతిథి లో హీరోయిన్ స్నేహితురాలిగా మొట్టమొదటిసారి నటించింది. అయితే హీరోయిన గా వరుసగా రెండు హిట్స్ కూడా అందుకుంది. అందం, అభినయం పరంగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. కానీ ఆ తర్వాతే దురదృష్టం వెంటాడింది. చాలా సినిమాలు చేసినా విజయం దక్కలేదు. తెలుగుతో పాటు తమిళ్ లో సినిమాలు చేసినా సక్సెస్ మాత్రం రాలేదు. దీంతో రాజకీయాల్లోకి అడుగు పెట్టింది.
బీజేపీ పార్టీలో చేరి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా పోటీ చేసింది. కానీ అక్కడ కూడా పరాజయం ఎదురైంది. ప్రస్తుతానికి సినిమాలకు దూరంగా ఉన్న ఈ అందాల తార తన సంచలన కామెంట్స్ తో నిత్యం వార్తల్లో నిలుస్తోంది. రాజకీయాల పరంగానే కాకుండా సామాజి అంశాలపై తనదైన శైలిలో స్పందిస్తుంటుందీ ముద్దుగుమ్మ. ఇటీవల అల్లు అర్జున్ పై కూడా ఆసక్తికర వ్యాఖ్యలు చేసి న్యూస్ లో నిలిచిన ఈ సొగసరి మరెవరో కాదు మాధవీ లత. ఇవి ఆమె టీనేజ్ నాటి ఫొటోలు. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే మాధవీలత తాజాగా ఒక పోస్ట్ ను షేర్ చేసుకుంది.
తన కాలేజీ ఐడీ కార్డును అందులో షేర్ చేసింది. కర్ణాటకలోని బళ్లారిలో వుంకి సన్నరుద్రప్ప (వీఎస్సార్) లా కాలేజీలో విద్యాభ్యాసం చేసినప్పటి ఐడీ కార్డు అది. ఈ ఐడీ కార్డును మాధవీలత స్వయంగా సోషల్ మీడియాలో పంచుకుంది. తవ్వకాల్లో బయటపడిందంటూ ఆమె చమత్కరించింది. బళ్లారిలోని వీఎస్సార్ కాలేజిలో ఎల్ఎల్ బీ చదివానని, ఇలాంటివి చూస్తుంటే అబ్బో జీవితంలో మనం చాలా చేశాం అనిపిస్తుంటుందని మాధవీలత పేర్కొంది. ప్రస్తుతం ఈ ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి. వీటిని చూసిన సినీ అభిమానులు, నెటిజన్లు క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.