సనాతన సంప్రదాయం నుంచి మన భారత సంప్రదాయంలో అనేక శకునాలు నమ్ముతూ వస్తున్నాం. వీటిలో ముఖ్యంగా బల్లి శకునాన్ని విశ్వసించే వారు ఎంతో మంది ఉన్నారు. శరీరంలోని ఏ భాగంపై పడితే ఏమవుతుందనే విషయాల గురించి జ్యోతిషంలోని గౌలి పఠన శాస్త్రం వివరిస్తుంది. అయితే మనలో ఎక్కువమంది జ్యోతిష్యాన్ని బలంగా విశ్వసిస్తారు. జ్యోతిష్య నియమాలను పాటించడం వల్లే కెరీర్ పరంగా సక్సెస్ అయ్యామని చెబుతూ ఉంటారు.
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కొన్ని శరీర భాగాలపై బల్లి పడితే మరణం సంభవిస్తుంది. మహిళలకు శరీరంపై ఎడమ భాగంలో బల్లి పడితే అనుకూల ఫలితాలు వస్తాయని పురుషులకు మాత్రం శరీరంపై కుడి భాగంలో బల్లి పడితే శుభం కలుగుతుందని చాలామంది విశ్వసిస్తారు. స్త్రీలకు తలపై బల్లి పడితే ప్రాణ భయం కలిగే ఛాన్స్ ఉండగా కుడి కాలుపై బల్లి పడితే శత్రు నాశనం జరుగుతుంది. కుడి చేయిపై బల్లి పడితే ధన లాభం కలిగే అవకాశం ఉండగా వీపుపై బల్లి పడితే మరణ వార్త వినాల్సి వస్తుంది.

స్త్రీలకు రెండు పెదవులపై బల్లి పడితే కొత్త కష్టాలు తలెత్తే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు. స్త్రీల కొప్పుపై బల్లి పడితే వాళ్లకు కొత్త వ్యాధుల భయం వేధిస్తుంది. పురుషులకు బ్రహ్మ రంధ్రమున బల్లి పడితే మరణం సంభవించే ఛాన్స్ ఉంటుంది. ఎడమ భుజంపై బల్లి పడితే గౌరవానికి భంగం కలిగించే చర్యలు జరుగుతాయి. నోటిపై బల్లి పడితే రోగాల బారిన పడే ఛాన్స్ ఉండగా రెండు పెదవులపై బల్లి పడితే కూడా మృత్యువు సంభవించే ఛాన్స్ ఎక్కువ. పై పెదవిపై బల్లి పడితే కలహాలు చోటు చేసుకునే ఛాన్స్ ఉండగా ఎడమ చెవిపై బల్లి పడితే లాభం కలుగుతుంది.
కుడి చెవిపై బల్లి పడితే బాధలు కలుగుతాయి. ముఖంపై బల్లి పడితే ధన లాభం కలుగుతుంది. శరీరంలో ఏ భాగంపై బల్లి పడినా స్నానం చేసి ఇష్ట దైవాన్ని ప్రార్థించడం ద్వారా చెడు జరగకుండా మనల్ని మనం రక్షించుకునే అవకాశాలు అయితే ఉంటాయి. అయితే కొంతమంది మాత్రం బల్లికి సంబంధించి జ్యోతిష్య శాస్త్రాన్ని నమ్మడానికి ఇష్టపడరు. ఇంట్లో చనిపోయిన బల్లి కనిపిస్తే కూడా అలా జరగడం చెడు జరుగుతుందని చెప్పడానికి సంకేతం అని చెప్పవచ్చు.