బల్లులు తరచుగా గోడలు , మూలల్లో కనిపిస్తాయి. ఎవరినీ ఇబ్బంది పెట్టదు. జ్యోతిష్యంలో బల్లి గురించి చాలా చెప్పబడింది. అందుకే బల్లిని చూడటం శుభమని కొందరు అశుభం అంటారు. అయితే దీనికి మీ ఇంట్లోనే ఒక పరిష్కారం ఉంది. కేవలం రెండు పదార్థాలను ఉపయోగించి మీ ఇంటి మూలల్లో దాగి ఉన్న బల్లులను కేవలం ఐదు నిమిషాల్లో తరిమికొట్టవచ్చు. ఇంట్లో బల్లులు పేరు లేకుండా చేయడానికి కర్పూరం,లవంగాలు సరిపోతాయి. చాలా మంది ఇళ్లల్లో బల్లుల బెడద ఎక్కువగా ఉంటుంది.
కిచెన్, హాల్, బెడ్ రూం, బాత్ రూం ఇలా ప్రతి ఒక్క రూంలో బల్లులు కనిపిస్తుంటాయి. బల్లులు ఇంట్లోకి రాకుండా ఉండాలంటే కొన్ని సులభమైన చిట్కాలు పాటించవచ్చు. కర్పూరం, లవంగంతో ఇంట్లో తిష్టవేసిన బల్లులను వెళ్లగొట్టొచ్చు. ఇందుకోసం ఇంటిని తుడిచే నీటిలో కర్పూరం పొడి, లవంగ నూనెను వేసి కలపాలి.

ఈ ఈ మిక్స్ చేసిన నీటితో ఇంటిని బాగా తుడుచుకోవాలి.. కర్పూరం, లవంగం నుంచి వచ్చే ఘాటైన వాసన ఇంట్లో బల్లులు మాత్రమే కాదు.. బొద్దింకల్ని కూడా తరిమికొడుతుంది. అంతేకాదు.. కొన్ని సింపుల్ చిట్కాల ద్వారా కూడా కూడా ఇంట్లో ఉన్న బల్లుల్ని తరిమికొట్టవచ్చు. ఇందుకోసం లవంగాల స్ప్రే, పుదీనా, బంతి, లావెండర్ వంటి మొక్కల్ని ఇంట్లో పెంచుకోవడం ద్వారా బల్లుల్ని ఇంటి నుంచి తరిమికొట్టవచ్చు.