కిడ్నీలను ఆరోగ్యంగా ఉంచుకోవడానికి సమతుల్య ఆహారం తీసుకోవడం, పుష్కలంగా నీరు తాగడం, చురుకైన జీవనశైలిని పాటించడం, మరియు ప్రాసెస్ చేసిన ఆహారాలు, సోడియం, అధిక ప్రోటీన్ తీసుకోవడం తగ్గించడం చాలా ముఖ్యం. అయితే ఈ మధ్య కాలంలో చాలా మంది మూత్రపిండాల వ్యాధితో బాధపడుతున్నారు. దీని వల్ల కొందరు కిడ్నీ వైఫల్యం చెంది ప్రాణాలు కోల్పోతున్నారు.
ఈ సమస్యల భారీన పండకుండా ఈ వ్యాధిని గుర్తించి ముందే చికిత్స తీసుకోవడం చాలా ముఖ్యం. రాత్రిపూట మూత్ర విసర్జన.. మీరు రాత్రిపూట తరచుగా మూత్ర విసర్జన చేస్తుంటే, టాయిలెట్‌కి వెళ్లడానికి తరచుగా మేల్కొంటే, అది మూత్రపిండాలు దెబ్బతిన్నాయనడానికి సంకేతం కావచ్చు. కొన్నిసార్లు నిద్రలోనే మూత్రం లీక్ అవ్వచ్చు. ఇలాంటి లక్షణాలను అస్సలు విస్మరించవద్దు వెంటనే వైద్యుడిని సంప్రదించండి.

పాదాలలో వాపు.. మీ పాదలలో వాపు కూడా కిడ్నీ వ్యాధులను సంకేతం కావచ్చు. ఎందుకంటే శరీరం ఉప్పు, నీటిని సరిగ్గా ఫిల్టర్ చేయకపోతే, పాదాలలో వాపు వస్తుంది. కొన్నిసార్లు సాయంత్రం, రాత్రి సమయంలో చేతుల్లో వాపు కనిపిస్తుంది. ఇది కూడా కిడ్నీ వ్యాధులకు సంకేతం కావచ్చు. కాబట్టి వీటి పట్ల కూడా జాగ్రత్తగా ఉండండి. రాత్రిపూట దురద.. మీకు రాత్రిపూట తరచుగా దురద, మంట పుట్టినట్టు అనిపిస్తే అది మూత్రపిండాల వైఫల్యానికి సంకేతం కావచ్చు.
మీ మూత్ర పిండాలు సరిగ్గా పనిచేయకపోతే.. మన శరీరంలోని అదనపు విషపదార్థాలు అన్ని పేరుకుపోతాయి. దీని కారణంగా చర్మంపై దురద, దద్దుర్లు రావడానికి దారితీస్తుంది. నిద్ర లేకపోవడం.. మన శరీరంలోని మూత్రపిండాల ముఖ్య పని శరీరం నుండి విషం, వ్యర్థాలను బయటకు పపడం. కానీ మూత్రపిండాలు సమస్య ఉన్నప్పుడు అవి సరిగ్గా పనిచేయవు. దీంతో శరీరంలో హానికరమైన పదార్థాలు పేరుకుపోతాయి. దీని కారణంగా రాత్రిపూట మనకు విశ్రాంతి ఉండదు.
దీని వల్ల సరిగ్గా నిద్ర పట్టదు. అలాగే రాత్రిపూట మీకు అలసటగా అనిపించినా, బలహీంగా అనిపించినా మూత్రపిండాల వైఫల్యానికి సంకేతం కావచ్చు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది: మూత్రపిండాల వైఫల్యం కొన్నిసార్లు నొప్పిని కలిగిస్తుంది. ఈ నొప్పి రాత్రిపూట ఎక్కువగా కనిపిస్తుంది. ఈ నొప్పి కారణంగా ప్రజలు రాత్రిపూట శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడవచ్చు. ఇది కూడా మూత్రపిండాల వైఫల్యానికి ఒక లక్షణం.
