కాలి బొటనవేలు కంటే పక్కన వేలు పొడవుగా ఉంటే అర్థం ఇదే. ఆ సీక్రెట్ తెలిస్తే..?

divyaamedia@gmail.com
2 Min Read

జ్యోతిష్యం అనేక శాఖలను కలిగి ఉంది. వాటిలో సముద్రశాస్త్రం ఒకటి. ఈ సాముద్రిక శాస్త్రంలో ముఖం, హస్త సాముద్రిక, అంగ సాముద్రిక మరియు పాద సాముద్రిక అనే అన్ని శాఖలు ఉన్నాయి. వాటి ద్వారా మన భవిష్యత్తును అంచనా వేయవచ్చు. ఈ సాముద్రిక శాస్త్రంలో అరచేయి, పాదాలు మరియు వేళ్ల ఆకృతిని విశ్లేషించారు. దీని ద్వారా మన జీవితం ఎలా ఉంటుందో తెలుసుకోవచ్చు. అయితే మీ కాలి వేళ్లు అన్ని కూడా ఒకే పరిణామంలో ఉంటే.. మీరు చాలా కష్టపడి పనిచేస్తున్నారని అర్ధం.

సమయాన్ని, వనరులను సరిగ్గా ఉపయోగించి మీ పనులను సకాలంలో పూర్తి చేసుకుంటారు. మీరు మీ వాగ్దానాలను నిలబెట్టుకుంటూ, సొంత లేదా ఇతరులకు ఇచ్చిన కమిట్‌మెంట్స్‌ను పూర్తి చేస్తారు. మీరు చాలా తెలివిగా ఉంటారు. అలాగే అందరితోనూ కలివిడిగా సాగిపోతారు. ఈ లక్షణాలే మీ రిలేషన్స్ పెరగడానికి దోహదపడతాయి. మీ మొదట, రెండు, మూడో కాలి వేళ్లు ఒకే ఎత్తులో ఉంటే, మీరు స్నేహపూర్వక, దయగల వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు.

అలాగే అవుట్‌గోయింగ్, సోషలైజ్డ్ వ్యక్తి అని అర్థం. మీరు కనెక్షన్స్ పెంచుకోవడంలో సిద్దహస్తులు. కొత్త వ్యక్తులను కలవడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటారు. మీరు చెప్పే, చేసే విషయాలలో ఎప్పుడూ నమ్మకంగా, దృఢంగా ఉంటారు. మీ కాలి మొదటి వేలు పొడవుగా ఉండి.. మిగతా నాలుగు వేళ్లు 45 డిగ్రీల కోణంలో ఉన్నట్లయితే.. మీరు ఎప్పుడూ స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకుంటారని అర్ధం. కొంచెం మొండితనం.. అలాగే సృజనాత్మకత కలిగి ఉంటారు. మీరు ఇతరులను ఈజీగా ఒప్పించగలరు.

ఇతరుల సీక్రెట్స్‌ను దాచిపెడతారు. అలాగే మీరు నమ్మదగిన వ్యక్తిగా పేరు తెచ్చుకుంటారు. మీ కాలి రెండో బొటనవేలు పెద్దదిగా ఉన్నట్లయితే, మీరు గ్రీకు పాదాల ఆకృతిని కలిగి ఉంటారట ఇలాంటి వారు నేచరుల్‌గా, ఉద్వేగభరితంగా, సృజనాత్మకతతో వ్యవహరిస్తారట. ప్రతీ పనిలోనూ అడ్వెంచర్ కోరుకుంటారు. మిమ్మల్ని మీరు ఉన్నత శిఖరాలను చేరుకునేందుకు విశ్వప్రయత్నాలు చేస్తారట. అలాగే కొత్త సవాళ్లను ఎల్లప్పుడూ ఎదుర్కుని.. విజయాలు సాధిస్తారట.

Share This Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *