లవంగాలు తినడం వల్ల చాలా లాభాలున్నాయి. ఇది బరువు తగ్గడానికి బాగా హెల్ప్ చేస్తుంది. నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెల్త్ ప్రకారం, లవంగాలని తీసుకుంటే క్యాన్సర్, మధుమేహం, పంటి నొప్పి, కడుపుపూతల వంటి సమస్యలు దూరమవుతాయి. అయితే వాస్తవానికి మసాలా దినుసు అయిన లవంగాలను పురాతన కాలం నుంచి వంటలలో ఉపయోగిస్తున్నారు. ఈ చిన్న ఎండిన మొగ్గను ఆయుర్వేదంలో కూడా ఉపయోగిస్తారు.. దీనిలోని ఔషధ గుణాలు ఎన్నో సమస్యలకు దివ్యౌషధంగా పనిచేస్తాయి. జీర్ణ సమస్య: లవంగం జీర్ణ సమస్యకు అద్భుతమైన ఔషధం.. జీర్ణ ఎంజైమ్‌ల ఉత్పత్తిని ప్రేరేపిస్తుంది.
ఆహారాన్ని విచ్ఛిన్నం చేయడంలో ఇది ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఖనిజాలను గ్రహిస్తుంది.. ముఖ్యంగా అజీర్ణం, కడుపు గ్యాస్, మలబద్ధకం నుంచి ఉపశమనం లభించేలా చేస్తుంది. యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు: లవంగాలు ప్రాణాంతక ఇన్‌ఫ్లమేటరీ సమస్యల నుంచి కూడా రక్షిస్తాయి. ఇది ఆర్థరైటిస్, గుండె జబ్బులు, క్యాన్సర్ వంటి సమస్యలను నివారిస్తుంది. లవంగాలు శక్తివంతమైన యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉంటాయి. ఇందులో యూజీనల్ ఉంటుంది. మంట సమస్యను తగ్గించి.. క్రమంగా ప్రాణాంతక వ్యాధులకు దూరంగా ఉంచుతుంది. దంత ఆరోగ్యం: లవంగాలను చాలా సంవత్సరాలుగా వివిధ ఔషధాలలో ఉపయోగిస్తున్నారు. ఇది దంత ఆరోగ్యానికి సహాయపడుతుంది.
లవంగాలు యాంటీ బాక్టీరియల్, క్రిమినాశక లక్షణాలను కూడా కలిగి ఉంటాయి. అంతేకాదు చిగుళ్ల సమస్యలను, దంత సమస్యలను నివారిస్తుంది. రక్తంలో చక్కెర స్థాయిలను నిర్వహిస్తుంది: లవంగం రక్తంలో చక్కెర స్థాయిలను నిర్వహిస్తుంది. మీ ఆహారంలో లవంగాలను చేర్చుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుకోవచ్చు. ఇది ఇన్సులిన్ నిరోధకతను మెరుగుపరుస్తుంది. జీవక్రియ రేటును ప్రేరేపిస్తుంది. ముఖ్యంగా టైప్ 2 మధుమేహాన్ని తగ్గిస్తుంది. కాలేయ ఆరోగ్యం: లవంగం డిటాక్సిఫైయర్‌గా పనిచేస్తుంది. ఇందులో ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఆక్సీకరణ ఒత్తిడి, వాపు సమస్యలను తగ్గిస్తుంది. కాలేయం దెబ్బతినకుండా చేస్తుంది. ముఖ్యంగా ఫ్యాటీ లివర్ సమస్యను నివారిస్తుంది. మొటిమల సమస్యలను నివారిస్తుంది: మొటిమల సమస్యలను తగ్గిస్తుంది.
లవంగం ఆస్తమా, బ్రోన్కైటిస్, దగ్గు చికిత్సకు యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉంది. లవంగాలు మంటను తగ్గించడంలో సహాయపడతాయి. లవంగాలను ఖాళీ కడుపుతో క్రమం తప్పకుండా తీసుకోవడం చాలా మంచిది.. దీనివల్ల మైగ్రేన్లు, తలనొప్పి తగ్గుతాయి. ఒక గ్లాసు గోరువెచ్చని పాలలో చిటికెడు లవంగాల పొడిని కలిపి కూడా తీసుకోవచ్చు.. భోజనం తర్వాత 1-2 లవంగాలను నమలడం వల్ల గ్యాస్/ఎసిడిటీని నివారించవచ్చు. ఎందుకంటే లవంగాలలో ఆల్కలీన్, కార్మినేటివ్ లక్షణాలు ఉన్నాయి.. ఇవి జీర్ణక్రియను సులభతరం చేస్తాయి. ఇంకా రోజులో ఎప్పుడైనా 1 లేదా 2 లవంగాలను తీసుకోవడం ఆరోగ్యానికి చాలా మంచిది.. రాత్రిపూట పడుకునేటప్పుడు ఒక్క లవంగం తింటే చాలామంచిదని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.