హిందూ పురాణాల ప్రకారం, లక్ష్మీదేవి ఆశీస్సులు ఉండే వారికి తమ జీవితంలో ఎప్పటికీ ధనానికి, ధాన్యానికి కొరత అనేదే ఉండదు. అందుకే అందరూ లక్ష్మీదేవిని నిత్యం భక్తి శ్రద్ధలతో కొలుస్తారు. అయితే గురువారం రోజున వ్రతం చేయడం వలన సాధకునికి కష్టాలన్నీ తొలగిపోతాయి. జీవితంలో చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఏర్పడి ఇబ్బంది పడుతున్న వారు లేదా ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ తమ పురోగతిలో అడ్డంకులు ఎదుర్కొంటున్న వారు గురువారం విష్ణువు, బృహస్పతి ఇద్దరినీ పూజించాలి.
నారాయణుని ఆరాధించడం ద్వారా లక్ష్మీదేవి కూడా ప్రసన్నురాలవుతుందని.. ఆర్ధిక ప్రయోజనం పొందుతారని నమ్ముతారు. తులసికి మహా విష్ణువుకు చాలా ప్రీతికరమైనదని నమ్ముతారు. అందువల్ల గురువారం తులసి పూజకు కూడా చాలా ప్రాముఖ్యత ఉంది. తులసి లేకుండా శ్రీ హరి ఆరాధన అసంపూర్ణంగా పరిగణించబడుతుందని నమ్ముతారు. అందుకే గురువారం నాడు శ్రీ మహా విష్ణువును పూజించేటప్పుడు ఖచ్చితంగా తులసిదళాలను విష్ణువుకి సమర్పించండి. ఏ దేవతను పూజించినా మంత్రాలకు చాలా ప్రాముఖ్యత ఉంటుంది.
అటువంటి పరిస్థితిలో విష్ణువు అనుగ్రహం పొందడానికి గురువారం రోజున జపమాలతో తులసిని జపించండి. ‘ఓం నమో భగవతే వాసుదేవాయ నమః’ అనే మంత్రాన్ని జపించండి. దీనివల్ల భగవంతుడు త్వరగా సంతోషిస్తాడని నమ్ముతారు. ఎవరికైనా వివాహంలో పదేపదే అడ్డంకులు ఎదురవుతున్నట్లయితే, లేదా బంధం ఖరారు అయిన తర్వాత విచ్ఛిన్నమైతే ఖచ్చితంగా గురువారం రోజున శ్రీ మహా విష్ణువును పూజించండి. ఈ రోజు కూడా ఉపవాసం ఉండండి. ఈ రోజున విష్ణువు ఆలయానికి వెళ్లి పసుపు పువ్వులు , పసుపు మిఠాయిలను సమర్పించండి.
దీనివల్ల భక్తుల కష్టాలన్నీ తొలగిపోతాయని నమ్మకం. గురువారం రోజున రావి చెట్టు, అరటి చెట్టు, తులసిని పూజించడం వల్ల విష్ణువు, లక్ష్మిదేవి అనుగ్రహం కూడా లభిస్తుంది. ఇలా చేయడం వల్ల సాధకుడికి ఆర్థిక సమస్యలు ఎదురుకావు. వీలైతే గురువారం పసుపు రంగు దుస్తులు ధరించండి. ఇది మాత్రమే కాదు పూజ చేసేటప్పుడు ఆసనంపై పసుపు వస్త్రం వేసుకుని మాత్రమే కూర్చోండి. ఈ పరిహారాన్ని చేయడం ద్వారా భక్తుడి జీవితంలో ఎన్నటికీ ఏ విషయంలోనూ కొరత ఉండదని నమ్ముతారు.