Kushboo: కాపాడాల్సిన సొంత తండ్రే నన్ను లైంగికంగా వేధించాడు: ఖుష్బూ

divyaamedia@gmail.com
3 Min Read

Kushboo: కాపాడాల్సిన సొంత తండ్రే నన్ను లైంగికంగా వేధించాడు: ఖుష్బూ

Kushboo: సినీ పరిశ్రమలో మీటూ వ్యవహారం అందరి మనసుల్ని కలిచివేస్తుందని.. అయినా వేధింపులకి ఎదురొడ్డి గళం విప్పిన ప్రతి మహిళకి సెల్యూట్ అంటూ ఖుష్బూ ఓ సుదీర్ఘ ట్వీట్ చేశారు. “ఇండస్ట్రీలో దారుణాలని బయటపెట్టడానికి జస్టిస్ హేమ కమిటీ చాలా ఉపయోగపడింది. వర్క్ లొకేషన్లో అధికారాలను దుర్వినియోగం చేయడం, లైంగిక ప్రయోజనాల కోసం మహిళలను ఇబ్బంది పెట్టడం, ఉన్నత స్థాయికి వెళ్లాలంటే రాజీ పడాల్సిందే అంటూ సలహాలు ఇవ్వడం ఇలాంటివన్నీ ప్రతి రంగంలోనూ ఉన్నాయి. అయితే జస్టిస్ హేమ కమిటీ నివేదిక సినిమా ఇండస్ట్రీలో ప్రకంపనలు రేపుతోంది. మలయాళ చిత్ర పరిశ్రమలో నటీమణులపై లైంగిక వేధింపులు, పని దోపిడీపై ఇందులో పొందుపరిచిన అంశాలు మాలీవుడ్ ను ఉక్కిరిబిక్కిరిచేస్తున్నాయి.

Also Read: తీవ్రంగా గాయపడిన సీనియర్ హీరోయిన్ ఖుష్బూ..! ఎలా జరిగిందో తెలుసా..?

దీనికి సంబంధించి ఇప్పటికే పలువురు స్టార్ నటులపై తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పోలీస్ కేసులు కూడా నమోదవుతున్నాయి. ఇక మోహన్ లాంటి స్టార్ హీరోలు కూడా తమ పదువులకు రాజీనామా చేశారు. మరోవైపు హేమ కమిటీ రిపోర్టుపై వివిధ రంగాలకు చెందిన సెలబ్రిటీలు స్పందిస్తున్నారు. తాజాగా ప్రముఖ సీనియర్ నటి, రాజకీయ నాయకురాలు మహిళలపై లైంగిక వేధింపులపై స్పందించారు. ట్విట్టర్ వేదికగా జస్టిస్ హేమ కమిటీ నివేదికపై ప్రశంసలు కురిపించిన ఆమె ఇలా రాసుకొచ్చారు. పని దోపిడీ, లైంగిక వేధింపులు, లాభాపేక్ష కోసం ఆడపిల్లలను దోచుకోవడం అన్నిచోట్లా ఉంది.

దీన్ని స్త్రీ ఒంటరిగా ఎదుర్కోవాలి. ఇక బాధితులకు మన సపోర్ట్‌ ఎంతో అవసరం. వారి బాధను మనం వినాలి. మానసికంగా వారికి భరోసా ఇవ్వాలి. సమస్య ఎదురైనప్పుడే వారెందుకు మాట్లాడలేదని చాలామంది ప్రశ్నిస్తున్నారు. బయటకు వచ్చి చెప్పే ధైర్యం అందరికీ ఉండదు కదా’ ‘తండ్రి వేధింపుల గురించి బయటకు వచ్చి మాట్లాడటానికి ఎందుకు అంత సమయం తీసుకున్నావు? అని గతంలో చాలామంది నన్ను అడిగారు. ఇది వాస్తవమే.. నేను ముందే మాట్లాడాల్సింది. నన్ను రక్షించాల్సిన వ్యక్తి నుంచే నేను వేధింపులు ఎదుర్కొన్నా.

Also Read: ఆ గుడిలోకి రావొద్దంటూ.. తెలుగు స్టార్ హీరోయిన్‌కు అవమానం.

చాలామంది మహిళలకు కుటుంబం నుంచి సరైన మద్దతు లేదనే విషయాన్ని అందరూ అర్థం చేసుకోవాలి. చిన్న గ్రామాలకు చెందిన ఎంతోమంది అమ్మాయిలు ఎన్నో ఆశలతో ఇక్కడికి వస్తారు. కానీ కొందరు దుర్మార్గులు వారి ఆశలను ఆదిలోనే తుంచేస్తున్నారు. పురుషులకు నేను చెప్పేది ఒక్కటే.. బాధిత మహిళలకు అండగా నిలవండి. మహిళలపై జరుగుతున్న ఈ సంఘటనలపై మీరు కూడా స్పందించాలి. మీ ప్రేమ, మద్దతును వారికి అందజేయండి. గుర్తుంచుకోండి, అందరూ కలిస్తేనే ఈ గాయాలు మానేలా చేయగలం. ఈ జస్టిస్ హేమ కమిటీ నివేదిక మనందరిలో మార్పు తీసుకురావాలి’’ అని ఖుష్బూ తెలిపారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది.

Share This Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *