Kushboo: తీవ్రంగా గాయపడిన సీనియర్ హీరోయిన్ ఖుష్బూ..! ఎలా జరిగిందో తెలుసా..?
Kushboo: ఖుష్బు సుందర్ ఒక ప్రముఖ భారతీయ చలనచిత్ర నటి. తెలుగు, తమిళ చిత్రాల్లో నటించింది. ఈమె ఒక గొప్ప హేతువాది, ప్రజల పట్ల సమాజం పట్ల, చాలా అవగాహన ఉంది. ఆమె ఒక ముస్లిం కుటుంబంలో పుట్టి తరువాత సినిమా ఇండస్ట్రీలో అడుగుపెట్టారు. అయితే ఒకప్పుడు సౌత్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగారు ఖుష్బూ సుందర్. తెలుగుతో పాటు తమిళ్, కన్నడ భాషల్లో వందలాది సినిమాల్లో హీరోయిన్ గా చేశారామె. ఖుష్బూ అందానికి ముగ్ధులైన అభిమానులు ఏకంగా ఆమెకు గుడి కట్టి ఆరాధించారు.
Also Read: జాన్వీ కపూర్ తో రాఖీ కట్టించుకున్న అభిమాని. తర్వాత ఏం చేసాడో మీరే చుడండి.
అంతలా ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నారీ అందాల తార. ఇక రెండో ఇన్నింగ్స్ లోనూ స్పెషల్ రోల్స్ లో సందడి చేస్తున్నారు సీనియర్ హీరోయిన్. పలు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటిస్తున్నారు. అలాగే నిర్మాతగానూ తన అభిరుచిని చాటుకుంటున్నారు. ఇటీవల ఆమె నటించి నిర్మించిన అరణ్మనై 4 సినిమా ఏకంగా రూ.100 కోట్లు వసూలు చేసింది. మరోవైపు పాలిటిక్స్ లోనూ బిజీ బిజీగా ఉంటున్నారు ఖుష్బూ. కాగా తాజాగా ఈ సీనియర్ నటి తీవ్రంగా గాయపడ్డారు. ఈ విషయాన్ని ఆమె సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంది. ఈ పోస్టులో ఆమె మోకాలికి కట్టుతో కనిపించింది.
Also Read: బిగ్ బాస్ హౌస్‌లోకి వేణు స్వామి, దీంతో నాగార్జున ఏం చేయబోతున్నారో తెలుసా..?
అయితే అసలు ఏం జరిగింది? తనగాయానికి కారణాలేంటి? ఏం ప్రమాదం జరిగింది? అన్న విషయాలు మాత్రం వెల్లడించలేదు ఖుష్బూ. ప్రస్తుతం వేగంగా కోలుకుంటున్నానని మాత్రం చెప్పుకొచ్చారామె. ప్రస్తుతం ఖుష్బూ సుందర్ షేర్ చేసిన పోస్ట్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. దీనిని చూసిన అభిమానులు, నెటిజన్లు ఆమె త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు. కాగా బీజేపీ కీలక నేతగా తమిళనాడు రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషిస్తున్నారు ఖుష్బూ. అయితే ఇటీవల ఆమె జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలి పదవికి రాజీనామా చేయడం తీవ్ర చర్చనీయాంశమైంది. అయితే స్టేట్ పాలిటిక్స్ లో మరింత యాక్టివ్ గా మారేందుకే రాజీనామా చేసినట్లు ఆమె వెల్లడించారు.
When you have your bestie to guard you. #ligamenttear#kneeinjury#HealingJourney pic.twitter.com/juguojUNAz
— KhushbuSundar (@khushsundar) August 27, 2024