ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్ రాజ్‌లో జరుగుతున్న ఈ వేడుకలో కోట్లాది మంది భక్తులు పాల్గొన్నారు. దేశ , విదేశాల నుంచి తరలి వచ్చి పుణ్యస్నానాలు చేస్తున్నారు. ఈ రోజు సినీ నటి సోనాల్ చౌహాన్ త్రివేణి సంగమం వద్ద పుణ్యస్నానం ఆచరించారు. ప్రత్యేక పూజలు చేశారు. అయితే 144 సంవత్సరాలకు ఒక్కసారి జరిగే ఈ మహా కుంభమేళాకు దేశ విదేశాల నుంచి కోట్లాది మంది భక్తులు తరలివస్తున్నారు. కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులతో కలిసి పవిత్ర త్రివేణి సంగమంలో పుణ్య స్నానాలు ఆచరిస్తున్నారు.
కేవలం సామాన్యులే కాదు సినీ, క్రీడా, రాజకీయ ప్రముఖులు కూడా మహా కుంభమేళాలో భాగమవుతున్నారు. ప్రధానంగా సినీ తారలు పెద్ద ఎత్తున ఈ ఆధ్యాత్మిక వేడుకలో భాగమవుతున్నారు. విజయ్ దేవరకొండ, హేమ మాలినీ, సంయుక్త మేనన్, యాంకర్ లాస్య, బింధుమాధవి, శ్రీనిధి శెట్టి, పూనం పాండే, పవిత్ర గౌడ, బిగ్ బాస్ ప్రియాంక జైన్, దిగంగన సూర్య వంశీ, రాజ్ కుమార్ రావు తదితర సినీ ప్రముఖులు కుంభమేళాలో పవిత్ర స్నానాలు ఆచరించారు.
తాజాగా ప్రముఖ హీరోయిన్ సోనాల్ చౌహాన్ మహా కుంభమేళాను దర్శించుకుంది. సోమవారం (ఫిబ్రవరి 10) సంప్రదాయ దుస్తులు ధరించి త్రివేణి సంగమంలో పవిత్ర స్నానాలు ఆచరించింది. అనంతరం తన ఆధ్యాత్మిక యాత్రకు సంబందించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. దీంతో అవి కొద్ది క్షణాల్లోనే వైరల్ గా మారాయి. పేరకు బాలీవుడ్ నటి అయినా సోనాల్ చౌహాన్ తెలుగు ఆడియన్స్ కి చాలా సుపరిచితం.
రెయిన్ బో సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన అమ్మడు లెజెండ్, డిక్టేటర్, రూలర్ సినిమాల్లో బాలకృష్ణ తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంది. అలాగే పండగ చేస్కో, షేర్, ఎఫ్3, ది ఘోస్ట్, ఆది పురుష్ తదితర సినిమాల్లోనూ కీలక పాత్రలు పోషించింది. అయితే క్రేజ్ మాత్రం తెచ్చుకోలేకపోయింది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ హిందీ సినిమాల్లో నటిస్తోంది.