యువతి ఎవరో ఏమిటో తెలీదు కానీ నెట్టింట ఆమె ఫొటోలు మాత్రం తెగ వైరల్ అవుతున్నాయి. ముదురు గోధుమ రంగులో ఉన్న కళ్లు, గొప్పకళాకారుడు ఎంతో శ్రద్ధి తీసుకుని తీర్చిదిద్దనట్టు ఉన్న ముఖం చూసి జనాలు ఆశ్చర్యపోతున్నారు. అయితే ఈ కుంభమేళాలో పాల్గొనేందుకు ప్రపంచం నలుమూలల నుంచి లక్షలాది సంఖ్యలో భక్తులు తరలివస్తారు. దీని కంటే ముందు ప్రతి నాలుగు సంవత్సరాలకు ఒకసారి కూడా కుంభమేళా కార్యక్రమాలు నిర్వహిస్తారు. అర్ధ కుంభమేళాను ప్రతి ఆరేళ్లకు ఒకసారి హరిద్వార్ లేదా ప్రయాగ్‌రాజ్‌లో నిర్వహిస్తారు.
అయితే పవిత్రమైన త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు ఆచరించేందుకు కోట్లాది మంది తరలివస్తున్నారు. పన్నెండేళ్లకు ఒకసారి జరిగే ఈ కుంభమేళా సోమవారం ప్రారంభమై ఫిబ్రవరి 26 వరకు జరగనుంది. ఈ వేడుక ముగింపు నాటికి 40 కోట్లకు పైగా భక్తులు తరలివస్తారని అంచనా వేస్తున్నారు. మొత్తం 45 రోజులపాటు సాగే ఈ మేళా ద్వారా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు రూ.2 లక్షల కోట్ల వరకు ఆదాయం సమకూరనుందని వ్యాపార వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇదంతా పక్కన పెడితే ఈ మహా కుంభమేళా వేడుకలో ఓ అమ్మాయి స్పెషల్ అట్రాక్షన్ అవుతుంది.
గత నాలుగైదు రోజులుగా సోషల్ మీడియాలో ఎక్కడ చూసిన ఆ అమ్మాయి వీడియోస్ కనిపిస్తున్నాయి. కాటుక దిద్దిన తేనె కళ్లు.. డస్కీ స్కీన్.. అందమైన చిరునవ్వు, సింపుల్ హెయిర్ స్టైల్ తో అద్భుతమైన అందంతో కట్టిపడేస్తుంది. ఇంతకీ ఆ అమ్మాయి హీరోయిన్ కాదు. అలాగే ఓ రంగానికి చెందిన ప్రముఖ వ్యక్తి కాదు. ఆమె కుంభమేళాలో దండలు అమ్ముకునే అమ్మాయి. కానీ ఇప్పుడు సోషల్ మీడియాలో స్టార్ అయిపోయింది. ఇండోర్ కు చెందిన ఈ అమ్మాయి ఇప్పుడు అనుహ్యంగా నెట్టింట సంచలనంగా మారింది. ఆమెకు సంబంధించిన ఫోటోస్, వీడియోస్ నెటిజన్లను మంత్రముగ్దులను చేస్తున్నాయి.
ఆ అమ్మాయి పేరు మోనాలిసా అని సమాచారం. ఆమె అందమైన రూపానికి, చిరునవ్వుకు కుంభమేళాకు వచ్చిన జనాలు ఫిదా అవుతున్నారు. ఆమె ఫోటోస్, వీడియోస్ నెట్టింట షేర్ చేస్తూ సహజ సౌందర్యం.. అద్భుతమైన అందం అంటూ కామెంట్స్ చేస్తున్నాయి. ముఖ్యంగా ఆమె కళ్లు మరింత అందంగా ఉన్నాయంటున్నారు. మరో వీడియోలో ఓ వ్యక్తి ఆమెను పెళ్లి చేసుకున్నారా అని అడగ్గా.. లేదు అని ఆన్సర్ ఇచ్చింది. ఎవరినైనా ఇష్టపడుతున్నారా ? అని మరో వ్యక్తి అడగ్గా.. తల్లిదండ్రులు తీసుకువచ్చిన వ్యక్తిని మాత్రమే పెళ్లి చేసుకుంటానని చెప్పింది. ప్రస్తుతం ఈ అమ్మాయి వీడియోస్ సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి.