అతి ప్రాచీన ఆలయాలకు పుట్టినిల్లు భారతదేశం. ఒక్కో దేవాలయానికి ఒక్కో విశిష్టత ఉంది. అతి ప్రాచీనమైన ఈ కుబేర ఆలయాన్ని ఒక్కసారి దర్శిస్తే జీవితంలో ధనానికి లోటుండదని అంటారు. దేవభూమి ఉత్తరాఖండ్‌లోని అల్మోరా నుంచి 40 కిలోమీటర్ల దూరంలో వెలసిన ఈ కుబేర ఆలయాన్ని జాగేశ్వర్ ధామ్ అని పిలుస్తారు. అయితే ఉత్తరాఖండ్‌లోని అల్మోరా నుంచి 35 కిలోమీటర్ల దూరంలో ఉన్న కుమావున్ హిమాలయ సానువులో ఉన్న జగేశ్వర్ ధామ్ ఆధ్యత్మికంగానే కాదు వాస్తుశిల్పానికి అత్యుత్తమ ఉదాహరణలలో ఒకటిగా నిలుస్తుంది.
ఇక్కడ 124 చిన్న, పెద్ద ఆలయాల సమూహం ఉంది. వీటిలో కుబేర భండారి ఆలయం ఉంది. యక్ష రాజు కుబేరుడు సంపదకు దేవుడిగా భావిస్తారు. ఆయన లంక నగరాన్ని పాలించే వాడు. అయితే అతని సవతి సోదరుడు రావణుడు చేతిలో ఓడిపోయాడు.అప్పుడు రావణుడు .. కుబేరుడి మొత్తం రాజ్యాన్ని ఆక్రమించుకున్నాడు.ఆ తరువాత కుబేరుడు హిమాలయాల్లోని అలకా అనే నగరంలో స్థిరపడ్డాడు.

కుబేరుని భక్తికి శివుడు సంతోషం రావణుడి చేతిలో ఓటమి తర్వాత కుబేర మహారాజు హృదయం బంగారం, వెండి లేదా సంపద కోసం ఆరాటపడటం మానేసి.. మానసిక శాంతిని కోరుకున్నాడు. అదే సమయంలో సతీ మరణం తర్వాత శివుడు ధ్యానం చేసిన లోయ వద్దకు కుబేరుడు వచ్చాడు. అప్పుటికే ఆ లోయలోని గాలి శివుని తపస్సుచే ప్రభావితమైంది. ఆ గాలి తగలడంతో కుబేరుడికి ఉపశమనం కలిగింది. దీంతో బేర మహారాజు మోకాళ్లపై నిలబడి శివుడిని ప్రార్థించాడు.
కుబేరుడి భక్తికి శివుడు సంతోషించాడు. దర్శనంతోనే కోరికలు నెరవేరుతాయి కుబేరుడి భక్తికి మెచ్చిన శివుడు.. కుబేరుడి ఆశీర్వదించి.. కుబేరుడు నిలబడి ఉన్న లోయలో నివాసానికి అనుమతినిచ్చాడు. తాను ఇక్కడే కొలువు ఉంటానని వరం ఇచ్చాడు. ఆ రోజు నుంచి జగేశ్వర్ ధామ్ కుబేరుడికి నివాసంగా మారింది.సంపదలకు అధిపతిగా.. సంపదను పంపిణీ చేసే బాధ్యతను కలిగి ఉన్న కుబేరుడు లక్ష్మీదేవికి సహాయకుడిగా పరిగణించబడుతున్నాడు.

ఇక్కడే కుబేరుడు.. శివుడిని పూజించి, శ్రేయస్సు కోసం ఆశీస్సులు పొందాడని నమ్ముతారు. ఇక్కడ నిర్మలమైన హృదయంతో శివుడిని, కుబేరుదిను పూజిస్తే కోరిన కోర్కెలు నెరవేరుతాయని.. జీవితంలో సంపదకు కొరత ఏర్పడదని చెబుతారు.
