కృష్ణంరాజుని తొక్కేసేందుకు అప్పుడు భారీ కుట్రలు చేసిన దర్శక, నిర్మాత. ప్రభాస్‌ తండ్రి రంగంలోకి రావడంతో..!

divyaamedia@gmail.com
2 Min Read

కృష్ణంరాజు.. 1966లో వచ్చిన ‘చిలకా గోరింక’ ఆయన తొలి సినిమా. హీరోగా చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టినప్పటికీ విలన్‌గానూ నటించారు. ‘అవే కళ్లు’ సినిమాలో విలన్‌గా చేశారు. 1977, 1984లో నంది అవార్డులు గెలుచుకున్నారు. 1986లో వచ్చిన ‘తాండ్ర పాపారాయుడు’ సినిమాకు ఉత్తమ నటుడిగా ఫిల్మ్‌ఫేర్ అవార్డు అందుకున్నారు. అయితే ఇదిలా ఉంటే హీరోగా రాణిస్తున్న సమయంలో కృష్ణంరాజుని తొక్కేసేందుకు కుట్ర జరిగిందట. ఆయన్ని అన్‌ పాపులర్‌ చేసే ప్రయత్నాలు జరిగాయట. ఈ క్రమంలో ఓ నిర్మాత తనని ఓ సినిమా కోసం బుక్‌ చేసుకున్నాడు. 20వేలు అడ్వాన్స్ కూడా ఇచ్చారు. ఆ తర్వాత వేరే హీరోని తీసుకున్నారట. దర్శకుడు, నిర్మాత కలిసి కుట్ర చేశారు.

అందులో భాగంగానే కృష్ణంరాజుని తీసేశారు. అడ్వాన్స్ డబ్బులు తిరిగి తీసుకునేందుకు వాళ్లు పెద్ద డ్రామా ఆడారట. అప్పట్లో పెద్దమనిషిగా వ్యవహరించిన నిర్మాత డీవీఎస్‌ రాజు వద్ద పంచాయితీ పెట్టారట. ఆయన ఫోన్‌ చేయడంతో వెళ్లిన కృష్ణంరాజు. ఆయన ముందే విషయం తేల్చేశాడు. సదరు నిర్మాత ఇచ్చిన అడ్వాన్స్ ని వెనక్కి తిరిగి ఇచ్చేశాడు. కానీ వాళ్లు మీటింగ్‌ పెట్టుకుని తనపై చేస్తున్న కుట్రని ఆపేయాలని వార్నింగ్‌ ఇచ్చాడట కృష్ణంరాజు. అయితే ఆ మీటింగ్‌ గురించి ముందే కృష్ణంరాజు తమ్ముడు, ప్రభాస్‌ తండ్రి సూర్యనారాయణరాజుకి తెలిసింది. దీంతో ఆయన ఊగిపోతున్నాడు.

దొరికితే చంపేయాలనేంత కోపంతో ఉగిపోతున్నాడట. అప్పటికీ తాను చెప్పినా వినడం లేదు. దీంతో డీవీఎస్‌ రాజుని హెచ్చరించారు కృష్ణంరాజు. ఆ సదరు నిర్మాత చేస్తున్న కుట్ర ఆపకపోతే నా తమ్ముడు నా చేతుల్లోనూ ఉండడు, ఆ తర్వాత జరిగే పరిణామాలను మీరే బాధ్యులు అని చెప్పారట. ఆ తర్వాత ఆయన విషయాన్ని సెట్‌ చేశారని, అంతేకాదు వారి బ్యానర్‌లో సినిమాలు ఇకపై చేయనని కూడా తెగేసి చెప్పాడట కృష్ణంరాజు. అప్పట్లో ఈ సంఘటన తనని బాగా బాధపెట్టిందని, చాలా రోజులు డిస్ట్రర్బ్ అయినట్టు తెలిపారు కృష్ణంరాజు. రెండు మూడు రోజులు నిద్ర పోలేదన్నారు. ఓపెన్‌ హార్ట్ విత్‌ ఆర్కే టాక్‌ షోలో ఈ విషయాన్ని వెల్లడించారు కృష్ణంరాజు.

ఆ నిర్మాత పేరు జీఎస్‌ రాజు అని వెల్లడించారు కృష్ణంరాజు. కొన్నేళ్ల క్రితం చేసిన ఓల్డ్ ఇంటర్వ్యూ ఇది. ఇప్పుడు వైరల్ అవుతుంది. ఆసక్తికరంగా మారింది. ప్రభాస్‌ తండ్రి అప్పట్లో నిర్మాతగా వ్యవహరించారు. కృష్ణంరాజు స్థాపించిన గోపీకృష్ణ బ్యానర్‌ని ఆయనే నిర్వహించేవారు. అన్నకి బ్యాక్‌ బోన్‌లా ఉండేవాడు ప్రభాస్‌ తండ్రి సూర్యనారాయణరాజు. కృష్ణంరాజు రెండేళ్ల క్రితం అనారోగ్యంతో కన్నుమూసిన విషయం తెలిసిందే. ఆయన నటనా వారసత్వాన్ని ప్రభాస్‌ కొనసాగిస్తున్నారు. ఇప్పుడు ఆయన పాన్ ఇండియాస్టార్‌, ఇంకా చెప్పాలంటే గ్లోబల్‌ స్టార్ ఇమేజ్‌ని సొంతం చేసుకుని రాణిస్తున్నారు.

Share This Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *