సంగీత సంచలనం చక్రి సారథ్యంలోనే ఎక్కువగా పాటలు పాడింది. వీరి కాంబోకి మంచి క్రేజ్ ఉండేది. వీరి పాటలు ఉర్రూతలూగించేవి. మాస్ పాటలతో ఆడియెన్స్ ని ఎంతగానో ఆకట్టుకున్నారు. అయితే ఒకప్పుడు స్టార్ సింగర్‌గా తెలుగు సంగీత ప్రియులను తన గాత్రంతో అలరించిన కౌసల్య, ఇప్పటికీ కూడా ప్రత్యేకమైన పాటలతో శ్రోతలకు మధురానుభూతి అందిస్తూనే ఉంది. బేస్ వాయిస్ అవసరమైన పాటలలో ఆమె ప్రత్యేక గుర్తింపు సాధించింది.
ముఖ్యంగా సంగీత దర్శకుడు చక్రి కాంపోజిషన్స్‌లో ఎక్కువగా పాడి మంచి క్రేజ్ సంపాదించింది కౌసల్య. వీరి కాంబినేషన్‌కు అప్పట్లో విపరీతమైన డిమాండ్ ఉండేది. ఈ క్రమంలోనే కౌసల్య–చక్రి మధ్య లవ్ ఎఫైర్స్ ఉన్నాయనే రూమర్స్ ఇండస్ట్రీలో ప్రచారం అయ్యాయి. ఇద్దరూ తరచూ కలసి పనిచేయడం, స్టూడియోలో ఎక్కువ సమయం గడపడం వంటివి ఈ వార్తలకు కారణమయ్యాయి. అయితే ఇటీవల ఈ రూమర్స్‌పై కౌసల్య స్పందిస్తూ.. నిజమైన విషయాన్ని బయటపెట్టింది.

“మేము ఎక్కువగా కలసి పని చేశాం కాబట్టి అలాంటి కథలు వచ్చాయి. కానీ నిజానికి చక్రి నన్ను మెంటర్‌లా భావించేవాడు. నా పాటలకు ఆయన అభిమానిగా పలు సార్లు ఇంటర్వ్యూల్లోనే చెప్పాడు. రికార్డింగ్ స్టూడియోలో నేను సింగర్‌గానే కాదు, రికార్డిస్ట్‌గా కూడా పనిచేశాను. అందుకే రూమర్స్ వచ్చాయి” అని ఆమె చెప్పింది. ఇండస్ట్రీలో రూమర్స్ అనేవి కామన్. అలానే చక్రి గారితో ఎఫైర్ రూమర్స్ వచ్చాయి. అయితే రూమర్స్ వచ్చాయని చేసే పనిని ఆపలేం కదా కౌసల్య స్పష్టం చేసింది.
“మొదట్లో అలాంటి వార్తలు షాక్ ఇచ్చాయి. కానీ తర్వాత పెద్దగా పట్టించుకోలేదు. నాకు టెక్నికల్‌గా వర్క్ చేయకపోతే ఖాళీగా కూర్చోవడం కష్టమే. చాలాసార్లు ఫోన్‌లోనే పాటలు ఎడిట్ చేసిన సందర్భాలు ఉన్నాయి” అని తెలిపింది. గతంలో చక్రి కూడా ఓ ఇంటర్వ్యూలో ఈ విషయం గురించి మాట్లాడినట్టు కౌసల్య గుర్తు చేసింది. “నా పాటలన్నీ హై పిచ్‌లో ఉంటాయి. అలాంటి పాటలు పాడటానికి హైదరాబాద్‌లో ఉన్నది కౌసల్య ఒక్కరే. ఆమె పాడితే మా ప్రాజెక్ట్‌కి ప్లస్ అవుతుంది” అని చక్రి అన్నాడని చెప్పింది.