ఆమె కింగ్ కోబ్రాను బంధించిన వైనాన్ని పలువురు వీడియో తీశారు. సామాజిక మాధ్యమాల్లోనూ.. మీడియాలోనూ ఈ వీడియో వైరల్ గా మారింది. పరుథిపల్లీ రేంజ్ ఫారెస్టు బీట్ ఆఫీసర్ గా వ్యవహరిస్తున్నరోహిణి అనే మహిళా అధికారిణి పెప్పరా అభయారణ్యంలోని ఒక కాలువలో 18 అడుగుల పొడవు ఉన్న కింగ్ కోబ్రాను ఒడుపుగా బంధించారు. అయితే దేశవ్యాప్తంగా అడవులు, వన్యప్రాణులను రక్షించడానికి అటవీ శాఖ ఉద్యోగులను నియమిస్తుంది.
కేరళ అటవీ శాఖలో ఒక మహిళా అటవీ అధికారి ఆశ్చర్యకరమైన పని చేశారు. ఆ మహిళ కేవలం 6 నిమిషాల్లో దాదాపు 18 అడుగుల పొడవైన కింగ్ కోబ్రాను పట్టేసింది. ఆమె రక్షించిన మొదటి కింగ్ కోబ్రా ఇది. ఆమె తన ఎనిమిదేళ్ల కెరీర్‌లో వందలాది పాములను రక్షించింది. ఆమె ఏ మాత్రం భయపడకుండా.. ధైర్యంగా పామును పట్టుకుంది. ఆమె పామును పట్టుకోవడంతో ఒక్కసారిగా ఉద్యోగులందరూ అవాక్కయ్యారు.
మధ్యాహ్నం 12.30 గంటల ప్రాంతంలో పామును పట్టుకుని దట్టమైన అడవిలోకి వదిలేశామని రోషిణి తెలిపారు. మీడియా నివేదికల ప్రకారం, బీట్ ఫారెస్ట్ ఆఫీసర్ జిఎస్ రోషిణి కేరళ అటవీ శాఖలో తన ఎనిమిది సంవత్సరాల కెరీర్‌లో 800 కి పైగా విషపూరితమైన, విషం లేని పాములను పట్టుకుని రక్షించారు. ఆమె అద్భుతమైన పని గురించి వీడియో టీవీ ఛానెళ్లలో ప్రసారం అయ్యాయి. ఈ ప్రమాదకరమైన పామును పట్టుకునే వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం వైరల్ అవుతోంది.
బల్లులు, బొద్దింకలకు భయపడే మహిళలు ఆమె నుండి నేర్చుకోవాలని కొందరు నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు. ఈ ఘటన జిల్లాలోని కట్టకడ రెసిడెన్షియల్ ప్రాంతంలో జరిగింది. రోషిణి నిమిషాల్లోనే కింగ్ కోబ్రాను పట్టుకొని సంచిలో బంధించింది. రోషిణి చూపిన ధైర్యసాహసాలను స్థానికులు,నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.