ఆరోగ్యం బాగా ఉంటే చాలు అనుకుని తరచుగా కొబ్బరి బోండాలు తాగుతున్నారు. కొబ్బరి నీళ్లు తాగటం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. అందులో ఎటువంటి సందేహం లేదు. అయితే వేసవి వచ్చిందంటే చాలు కొబ్బరి బోండాలు, కొబ్బరి నీళ్లకు గిరాకీ పెరుగుతుంది. కొందరు సీజన్‌తో పనిలేకుండా మంచి ఆరోగ్యం కోసం ప్రతి రోజూ కొబ్బరి నీళ్లు తాగుతూ ఉంటారు.
కాస్త ఖరీదు ఎక్కువనిపించినా కొబ్బరి నీళ్లు ఆరోగ్యానికి చాలా మంచివి. ఇందులో కార్బోహైడ్రేట్లు, ముఖ్యమైన పోషకాలతో సహజంగా లభించే కొబ్బరి బోండాలు చాలా ఉత్తమం. ఇంకా మెగ్నీషియం, కాల్షియం, ఫాస్పరస్ పోషకాలు పుష్కలంగా వీటిల్లో లభిస్తాయి. కానీ, కొందరు కంత్రీగాళ్లు కొబ్బరి బోండాలను కూడా కల్తీ చేస్తున్నారు. కొబ్బరికాయలను పెద్దవిగా, బరువుగా చేయడానికి రసాయనాలను ఇంజెక్ట్ చేస్తున్నారని చూపించే వీడియో ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది.
ఈ వీడియో ఆన్‌లైన్‌లో తవ్ర చర్చకు దారితీసింది. గమనించదగ్గ విషయం ఏమిటంటే, ఇలాంటి వీడియోలు గతంలో సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. కొన్నిసార్లు కూరగాయలకు రసాయనాలు ఎక్కించడం, పండ్లలోకి ఇంజెక్ట్ చేయడం వంటివి చూపించారు. ఈ రసాయనాలు మన శరీరానికి, ఆరోగ్యానికి పూర్తిగా అనారోగ్యకరమైనవి. షాకింగ్ కామెంట్స్‌తో స్పందించారు. కొబ్బరి నీళ్ళు మాత్రమే నమ్మకానికి మూలం, అది కల్తీ లేనిదని నమ్మేవారు, కానీ ఇప్పుడు అది కూడా ఇంజెక్ట్ చేయబడుతోంది.
దీని అర్థం తినదగిన వాటిపై నమ్మకం సన్నగిల్లుతూనే ఉంటుంది. ఈ వీడియోలు ప్రజలలో ఆగ్రహాన్ని రేకెత్తించాయి. మార్కెట్ నుండి పండ్లు, కూరగాయలు కొనుగోలు చేసేటప్పుడు ప్రత్యేక శ్రద్ధ అవసరమని ప్రజలు అంటున్నారు. లేకుంటే మనం పండ్లకు బదులుగా విషాన్ని తినే ప్రమాదం ఉందంటున్నారు.
