కిరణ్ అబ్బవరం.. హిట్, ఫ్లాపులతో సంబంధం లేకుండా కథాబలం ఉన్న చిత్రాలను ఎంచుకుంటూ తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుంటున్నారు. కమర్షియల్ హంగులతో పాటు ప్రయోగాత్మక చిత్రాలనూ చేస్తూ ప్రేక్షకులను మెప్పిస్తున్నారు. అయితే ఈ ఏడాది మే 22న ఒక పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది రహస్య.
ఈ శుభవార్తను సోషల్ మీడియా ద్వారా పంచుకుని మురిసిపోయాడు హీరో కిరణ్ అబ్బవరం. హనుమాన్ జయంతి రోజున తమ ఇంట్లోకి బిడ్డ అడుగు పెట్టాడని ఉబ్బితబ్బిబ్బైపోయాడు. అయితే తన కుమారుడి ఫొటోలను మాత్రం ఎవరికీ చూపించలేదీ యంగ్ హీరో. తన కొడుకు పాదాలను ముద్దు పెట్టుకుంటున్న ఫొటోను మాత్రమే సోషల్ మీడియాలో షేర్ చేశాడు.
దీంతో కిరణ్ అబ్బవరం కుమారుడు ఎలా ఉన్నాడో చూద్దామని పరితపించిన వాళ్లకు నిరాశే ఎదురైంది. తాజాగా కిరణ్ అబ్బవరం- రహస్య దంపతులు సోషల్ మీడియాలో ఒక క్యూట్ వీడియోను షేర్ చేసుకున్నారు. ఈ సందర్భంగా తమ కుమారుడితో మొదటి ఫొటో షూట్ నిర్వహించారీ లవ్లీ కపుల్. దీనినే ఇన్ స్టా గ్రామ్ లో షేర్ చేసి ‘‘మా ఇటీవలి జీవితం.
నా కొడుకు మొదటి ఫొటోషూట్’ అని క్రేజీ క్యాప్షన్ రాసుకొచ్చాడు కిరణ్ దంపతులు. అయితే ఇందులో తమ కుమారుడి ఫేస్ కనిపించకుండా ఎమోజీలతో షేర్ చేశాడు. అయితే ఈ వీడియో మాత్రం చాలా క్యూట్ గా ఉంది. నెటిజన్లను అమితంగా ఆకట్టుకుంటోంది.