కిడ్నీ అక్రమంగా విక్రయిస్తూ లక్షలు సంపాదిస్తోంది ఓ ముఠా. పైగా ఇదంతా చేసింది డాక్టర్‌లే. ఇలాంటివి చేయడం తప్పు అని తెలిసినా ఏ మాత్రం పట్టించుకోకుండా.. అడ్డగోలుగా కిడ్నీ మార్పిడులు చేస్తున్నారు. అయితే పశ్చిమబెంగాల్‌లోని హవ్‌డా జిల్లాకు చెందిన మహిళ తమ కుమార్తెను బాగా చదివించి, వివాహం చేయాలంటే చాలా డబ్బు కావాలని, అందుకు తన భర్తను కిడ్నీ అమ్మాల్సిందిగా సూచించింది.
కిడ్నీ అమ్మితే పెద్దమొత్తంలో డబ్బు వస్తుందని దాంతో మన ఆర్ధిక సమస్యలన్న్ఈ తీరిపోతాయని నమ్మించింది. భార్య పట్టుబట్టడంతో చేసేది లేక సదరు భర్త తన కిడ్నీని రూ.10 లక్షల రూపాయలకు అమ్మాడు. ఆ డబ్బుతో తన కుటుంబ సమస్యలు తీరిపోతాయని, అందరూ సంతోషంగా ఉండొచ్చని భావించాడు. డబ్బు తీసుకొచ్చి భార్యకు ఇచ్చాడు. ఇంకేముంది ఆ డబ్బు తీసుకొని భర్తను, కుమార్తను మోసం చేసి ఫేస్‌బుక్‌లో పరిచయమైన రవిదాస్ అనే వ్యక్తితో మహిళ పరారయ్యింది.
విషయం తెలుసుకొని లబోదిబోమన్న భర్త పోలీసులను ఆశ్రయించాడు. పోలీసుల సహాయంతో మహిళ, అతని ప్రియుడు ఉన్న ప్రాంతానికి వెళ్లారు. అయితే ఆ మహిళ తన భర్తతో మాట్లాడేందుకు కూడా ఒప్పుకోకపోగా, అతనికి విడాకులు ఇస్తానని బెదిరించింది. చేసేది లేక, తన భార్య మాటలు నమ్మి మోసపోయానని, తనకు, తన పిల్లలకు న్యాయం చేయాలని పోలీసులను వేడుకున్నాడు సదరు భర్త.