కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్ తల్లి కన్నుమూశారు. సుదీప్ తల్లి సరోజా సంజీవ్ గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతుంది. అయితే తాజాగా కన్నడ సినీ పరిశ్రమలో విషాదం నెలకొంది. కన్నడ స్టార్ హీరో కిచ్చ సుదీప్ తల్లి కన్నుమూసింది. కిచ్చ సుదీప్ తల్లి సరోజా సంజీవ్ గత కొన్నాళ్లుగా వయోభారంతో, పలు ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు.
కొన్ని రోజులుగా బెంగుళూరులోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో ఉంచి ఆమెకి చికిత్స చేస్తున్నారు. చికిత్స తీసుకుంటూనే కిచ్చ సుదీప్ తల్లి నేడు ఉదయం మరణించింది. దీంతో సుదీప్ ఇంట్లో విషాదం నెలకొంది. సుదీప్ ఫ్యాన్స్, కన్నడ ప్రముఖులు ఆమెకు నివాళులు అర్పిస్తున్నారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ఆమెకు నివాళులు అర్పించారు.
తన అధికారిక ప్రకటన ద్వారా.. ప్రముఖ నటులు శ్రీ కిచ్చా సుదీప్ గారి మాతృమూర్తి శ్రీమతి సరోజ గారు కన్నుమూశారని తెలిసి చింతించాను. శ్రీమతి సరోజ గారు ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్దిస్తున్నాను. తన నట జీవితంపై తల్లి ప్రభావం, ప్రోత్సాహం ఉందని శ్రీ సుదీప్ గారు తెలిపారు. మాతృ వియోగం నుంచి ఆయన త్వరగా కోలుకోవాలి.
శ్రీ సుదీప్ గారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నాను అని తెలిపారు పవన్ కళ్యాణ్. ఇక కిచ్చ సుదీప్ కన్నడలో స్టార్ హీరోగా ఎదిగి తెలుగులో ఈగ సినిమాలో విలన్ గా పరిచయం అయి ఇప్పుడు పలు డబ్బింగ్ సినిమాలతో కూడా మెప్పిస్తున్నారు.