సినిమాలో నటించిన పలువురు నటులు అనారోగ్య సమస్యలతో ఒక్కొక్కరుగా మరణించడం బాధాకరం. ఇటీవలే ముంబై డాన్ పాత్ర పోషించిన నటుడు కన్నుమూశాడు. ఇప్పుడు మరో కీలక నటుడు క్యాన్సర్ బారిన పడినట్టు తెలిసింది. అతను మరెవరో కాదు.. సినిమాలో హీరో వెన్నంటే ఉండి, ఎలివేషన్లు ఇచ్చే ‘చాచా’ పాత్రలో నటించిన హరీష్ రాయ్. అయితే కేజీఎఫ్ సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాలిసిన అవసరం లేదు.
కన్నడ భాషలో ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన కేజీఎఫ్, కేజీఎఫ్ 2 సినిమాలు భారీ విజయాన్ని అందుకున్నాయి. యశ్ హీరోగా నటించిన కేజీఎఫ్ సినిమాలో హరీష్ రాయ్ కీలక పాత్రలో నటించాడు.. ఈ సినిమా హీరోకు ఆయన ఇచ్చే ఎలివేషన్ సినిమాకే హైలైట్ అనే చెప్పాలి. అయితే ఆయన గత కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. హరీష్ రాయ్ థైరాయిడ్ క్యాన్సర్ తో బాధపడుతున్నట్టు తెలుస్తుంది.
ఇటీవల ఆయన మాట్లాడుతూ.. తాను థైరాయిడ్ క్యాన్సర్ తో పోరాడుతున్నట్టు తెలిపాడు. ఆయనకు వైద్యం చేయించడానికి రూ. 70లక్షలు ఖర్చవుతుంది వైద్యులు తెలిపారు. ఒక్కొక్క ఇంజక్షన్ ఖరీదు రూ.3.5 లక్షలు అవుతుందని తెలిపాడు. ఒక సైకిల్ కి మూడు ఇంజక్షన్లు తీసుకోవాలి.. అంటే ఒక్క సైకిల్‌కు రూ.10.5 లక్షలు అవుతుంది. 17 నుండి 20 ఇంజక్షన్లు తీసుకోవాలి. ఇందుకోసం రూ. 70లక్షలు ఖర్చవుతుందని తెలిపాడు హరీష్ రాయ్.
చికిత్స కోసం ఆర్థిక సహాయం చేయాలి అని కోరుతున్నాడు హరీష్ రాయ్. ఇప్పటికే హరీష్ రాయ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ వీడియోలో ఆయన గుర్తుపట్టలేనంతగా మారిపోయాడు.
KGF Fame Harish Roy Condition Is Not Good, As He Is Suffering From Cancer, Please Everyone Share This As Much As possible And Help Him Whatever You Can Give Him, Your Amount Helps Him To Come Out From This Tough Cancer Disease 🥺🙏@KicchaSudeep @TheNameIsYash @nimmaupendra… pic.twitter.com/Dq4P8xEjZn
— UDay✘ (@PROUDAYZ) August 27, 2025