నటుడు హరీష్ రాయ్..కొంతకాలంగా థైరాయిడ్ క్యాన్సర్‌తో బాధ పడుతున్న ఆయన బెంగుళూరులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం తుది శ్వాస విడిచారు. కన్నడలో ఎన్నో సినిమాల్లో నటించిన హరీష్… ‘కేజీఎఫ్’ ఖాసిం చాచాగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.
ఆయన మృతి పట్ల పలువురు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అయితే కేజీఎఫ్ సినిమాలో యష్ ఛాఛా పాత్రలో నటించి పాన్ ఇండియా లెవల్లో గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే కేజీఎఫ్ రెండో పార్ట్ రిలీజయ్యే సమయానికి ఆయనకు థైరాయిడ్ క్యాన్సర్ ఉన్నట్లు తేలింది. దీంతో అతడి బలహీనంగా మారి కడుపు పూర్తిగా వాచిపోయింది.

థైరాయిడ్ క్యాన్సర్ నాలుగో స్టేజ్ కావడంతో చికిత్స కోసం యశ్, హీరో ధృవ్ సర్జా, నిర్మాత ఉమాపతి శ్రీనివాస్, దర్శన్ అభిమానులు, అనేక మంది నటీనటులు హరీష్ రాయ్‌కు ఆర్థిక సహాయం అందించారు. 90’sలలో సినిమాల్లో విలన్ పాత్రలు పోషించాడు హరీష్ రాయ్. నిజ జీవితంలోనూ హరీష్ రాయ్ ఒక కేసులో జైలు పాలయ్యాడు.
దర్శన్ జైలుకు వెళ్ళినప్పుడు, హరీష్ రాయ్ తన జైలు రోజులను గుర్తుచేసుకుని కన్నీళ్లు పెట్టుకున్నాడు. హరీష్ రాయ్ కు భార్య , ఇద్దరు కుమారులు ఉన్నారు. హరీష్ రాయ్ కన్నడలోనే కాకుండా తమిళ సినిమాల్లో కూడా నటించారు.
