స్టార్ డైరెక్టర్ సినిమాలో ఛాన్స్ తో జాక్ పాట్ కొట్టేసిన నల్గొండ కేతమ్మ, చివరికి ఏం జరుగుతుందో..?

divyaamedia@gmail.com
2 Min Read

బిగ్‌బాస్‌లో ఛాన్స్ కోసం ఎన్ని దశలు దాటుకుని 15 మంది సెలెక్ట్ అయ్యారు. వీరిలో ఇద్దరు లేదా ముగ్గురి వరకు హౌస్‌లో అడుగుపెట్టొచ్చనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. అయితే అగ్నిపరీక్ష పేరుతో కామనర్స్‌ పట్ల అమర్యాదగా ప్రవర్తిస్తున్నారనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. అయితే తాజాగా ఈ బిగ్ బాస్ అగ్ని పరీక్షకు ప్రముఖ డైరెక్టర్ జాగర్లమూడి క్రిష్ వచ్చారు.సెప్టెంబర్ 5న తన ఘాటి సినిమా రిలీజ్ కాబోతుండటంతో ప్రమోషన్స్ కోసం బిగ్‌బాస్ అగ్నిపరీక్షకి వచ్చారు.

ఈ సందర్భంగా అగ్ని పరీక్ష కాంటెస్ట్ కు ఎంపికైన కంటెస్టెంట్ల గురించి ఆసక్తిగా తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఇక్కడున్న కంటెస్టెంట్లలో మీకు ఎవరు బాగా అనిపించారని క్రిష్‌ని అడిగింది శ్రీముఖి. దీంతో నికితా పేరు చెప్పారు క్రిష్. అలానే మాస్క్ మ్యాన్ హరీష్‌ని చూసి మీ హెయిర్ స్టయిల్ చాలా బావుంది అన్నారు. ఈ సందర్భంగా కంటెస్టెంట్స్ లో కొత్త మందికి ఒక డిఫరెంట్ టాస్క్ ఇచ్చాడు నవదీప్.

‘మీలో ఎవరైనా సరే డేర్ చేసి నా ముఖం మీద నీళ్లు కొట్టాలి’.. అంటూ ఛాలెంజ్ విసిరాడు. అయితే కంటెస్టెంట్స్ ఎవరూ ముందుకు రాలేదు. అయితే తాను కంటెస్టెంట్ అయితే ఖచ్చితంగా నీళ్లు కొట్టేవాడ్ని అంటూ క్రిష్ చెప్పారు. ఇదే సందర్భంగా నల్గొండ కేతమ్మ మాట్లాడుతూ.. ‘యజమాని అంటే మనకి దేవుడు.. కొట్టలేం సార్ అని చెప్పింది. దేవుడు అంటున్నారు కదా శివుడి మీద నీళ్లు పోస్తున్నాం అనుకొని పోసేయండి.. అని క్రిష్ రిప్లై ఇచ్చాడు.

ఆ తర్వాత కేతమ్మ తన జీవితంలో పడిన కష్టాల గురించి పాట రూపంలో చెప్పింది. ఆమె ప్రతిభకు ఫిదా అయిన డైరెక్టర్ క్రిష్ ‘మీకు ఇష్టం ఉంటే నా తదుపరి చిత్రంలో మీ చేత ఓ చిన్న పాత్ర చేయిస్తాను’ అని ఆఫర్ ఇచ్చారు. ఇది వినగానే కేతమ్మ కళ్లల్లో నీళ్లు తిరిగాయి. మీరు వచ్చినప్పటి నుంచి ఏ భేషజాలు లేకుండా ఆటని ఆటలాగ చాలా చక్కగా ఆడుతున్నారు.. అన్నింటికంటే ఏంటంటే ఇసుమంత కూడా ఎక్కడా తగ్గకుండా వీళ్లందరూ ఒక ఎత్తు మీరు ఒక ఎత్తులా కనబడ్డారు.. అంటూ కేతమ్మ పై ప్రశంసలు కురిపించారు.

మొత్తానికి బిగ్ బాస్ లో వెళ్లినా, వెళ్లకపోయినా క్రిష్ తర్వాతి సినిమాలో నల్గొండ కేతమ్మ కనిపించనుందన్నమాట.

Share This Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *