Keerthy Suresh | మహానటి కీర్తి సురేష్ ఈ పేరు గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. కీర్తి సురేష్ బాలనటిగా తన కెరీర్ ను మొదలుపెట్టింది. ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సు చేసిన తర్వాత సినిమాల్లోకి అడుగుపెట్టింది. ఈ క్రమంలో ఒక జాతీయ చలనచిత్ర అవార్డు , ఐదు సైమా అవార్డులు, రెండు ఫిలింఫేర్ అవార్డ్స్ అందుకోవడంతోపాటు పలు ప్రశంసలు దక్కించుకుంది.. తమిళ్, తెలుగు, మలయాళంలో ఎన్నో హిట్ సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆమె తన అందం, అభినయంతో అభిమానులను కూడా ఆకట్టుకుంది.
టాలీవుడ్ ఇండస్ట్రీలో ఊహించని స్థాయిలో క్రేజ్ కలిగి ఉన్న హీరోయిన్లలో కీర్తి సురేష్ ఒకరు. భోళా శంకర్ రిజల్ట్ వల్ల కీర్తి సురేష్ కు గతంతో పోలిస్తే ఆఫర్లు తగ్గినా ఆమెను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య మాత్రం పెరుగుతోందే తప్ప తగ్గడం లేదు. మరోవైపు కీర్తి సురేష్ సైరన్ అనే సినిమాలో నటించగా థియేటర్లలో విడుదల కానుంది. ఈ సినిమాలో కీర్తి సురేష్ పోలీస్ ఆఫీసర్ రోల్ లో కనిపించనున్నారు.
ఇది ఇలా ఉంటే కీర్తి సురేష్ పెళ్లి వార్త మరోసారి నెట్టింట వైరల్ గా మారింది. త్వరలోనే మహానటి పెళ్లి పీటలు ఎక్కబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ మ్యాచ్ ఆమె తల్లిదండ్రులు నిర్ణయించిందని .. దానికి కీర్తి కూడా అంగీకరించినట్లు తెలుస్తోంది. వరుడు ఆమె తండ్రి సురేష్ ఫ్యామిలీకి చాలా దగ్గరి బంధువట. వీరి పెళ్లి గోవాలో జరగబోతుందని సమాచారం. కానీ దీనికి సంబంధించిన కీర్తి, ఆమె కుటుంబ సభ్యులు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.
ప్రతిరోజూ రాత్రి 9 గంటలు దాటితే నాకు అది కావాల్సిందే.. కస్తూరి
అయితే రెండేళ్ల క్రితం కూడా కీర్తి పెళ్ళికి సంబంధించి పలు రకాల వార్తలు వైరలైన సంగతి తెలిసిందే. ప్రముఖ రాజకీయ నాయకుడిని పెళ్లిచేసుకోబోతుందని మొదట ప్రచారం జరిగింది. ఆ తర్వాత సింగర్ అనిరుధ్ రవిచందర్‌ను డేట్ చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. కానీ ఈ వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదని కీర్తి తండ్రి సురేష్ ఓ ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చారు. మరి ఇప్పుడు వైరల్ అవుతున్న వార్తలో ఎంత నిజముందో తెలియాల్సి ఉంది.