ఆస్కార్ విజేత కీరవాణి తండ్రి శివశక్తి దత్తా అనారోగ్యంతో కన్నుమూసారు. ఆయన వయసు 92 యేళ్లు. ఈయన రచయతగానే కాకుండా సంగీత దర్శకుడిగా పలు సినిమాలకు పనిచేశారు. అయితే ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణి ఇంట్లో విషాదం చొటు చేసుకుంది. కీరవాణి తండ్రి శివశక్తి దత్త కన్నుమూశారు. శివశక్తి దత్త కన్నుమూశారు. ఆయన తెలుగు సినిమా రంగంలో రచయితగా, దర్శకుడిగా గుర్తింపు పొందారు.
శివశక్తి దత్త అసలు పేరు కోడూరు సుబ్బారావు.. ఆయన మరణంతో సినీ ఇండస్ట్రీలో, కీరవాణి కుటుంబంలో విషాదం నెలకొంది. శివశక్తి దత్త సోమవారం అర్ధరాత్రి కన్నుమూశారు. తెలుగు సినిమాల్లో సంస్కృత ఆధారిత పాటలు రాయడంలో ప్రత్యేక గుర్తింపు పొందారు శివశక్తి దత్త . శివశక్తి దత్త చిన్న వయస్సు నుంచి కళలపై మక్కువ చూపారు.

ఏలూరు సి.ఆర్. రెడ్డి కళాశాలలో ఇంటర్మీడియట్ చదువుతూ మధ్యలో చదువు మానేసి, ముంబైలోని సర్ జె.జె. స్కూల్ ఆఫ్ ఆర్ట్‌లో చేరారు. అక్కడ డిప్లొమా పొంది, కొవ్వూరు తిరిగి వచ్చారు. కమలేష్ అనే కలం పేరుతో రచనలు చేసేవారు. సంగీతంపై ఆసక్తితో గిటార్, సితార్, హార్మోనియం వాయించడం నేర్చుకున్నారు.
సినిమా రంగంపై ఆసక్తితో చెన్నైకి వెళ్లి, అక్కడ స్థిరపడ్డారు. శివ శక్తి దత్త దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి మామ, రచయిత వి. విజయేంద్ర ప్రసాద్ సోదరుడు. రాజమౌళి దర్శకత్వం వహించిన సై , ఛత్రపతి, బాహుబలి, రాజన్న, ఆర్ఆర్ఆర్ సినిమాలతో పాటు హనుమాన్ సినిమాకు కూడా ఆయన పాటలు రాశారు.