Kedareshwar Cave: ఈ ఆలయాన్ని 6వ శతాబ్దంలో హరిశ్చంద్రగడ్ కోట లోపల కలచూరి రాజవంశం నిర్మించింది. గొప్ప గొప్ప బుుషులలో ఒకరైన చాంగ్‌దేవ్ ఇక్కడే ఉండి 14వ శతాబ్దంలో ప్రసిద్ధ గ్రంథమైన తత్వసార్ రచించాడు. ఈ ఆలయానికి సమీపంలో మూడు గుహలు ఉన్నాయి. అందులో ఒక గుహలో 5 అడుగుల శివ లింగం ఉంది. అయితే ఈ ఆలయం మహారాష్ట్రలోని అహ్మద్‌నగర్ జిల్లాలోని హరిశ్చంద్రగఢ్ అనే కొండకోటలో ఉంది. దీని పేరు కేదారేశ్వర గుహ దేవాలయం. ఈ ఆలయంలోని అతీంద్రియ సౌందర్యంతో పాటు దీనిలోని అనేక రహస్యాలు ఏళ్ల తరబడి ప్రజలను ఆకర్షించేలా చేస్తోంది.
ఎందుకంటే ఈ ఆలయ నిర్మాణం చాలా రహస్యమైనది. ఏ నిర్మాణం నిలబడాలన్నా కనీసం నాలుగు స్థంబాలు కావాలి అంటారు. అయితే ఈ అద్భుత దేవాలయం ఏళ్ల తరబడి ఒకే స్తంభంపై నిలుస్తోంది. ఈ ఆలయాన్ని 6వ శతాబ్దంలో కలచూరి వంశస్థులు నిర్మించారని చెబుతారు. అయితే ఈ కోట గుహలు 11వ శతాబ్దంలో కనుగొనబడ్డాయి. నిజానికి ఈ ఆలయంలో నాలుగు స్తంభాలు కనిపిస్తాయి. అయితే ఒక స్తంభం మాత్రమే భూమికి అనుసంధానించబడి ఉంది. మిగిలిన మూడు ఇప్పటికే విరిగిపోయాయి. ఈ ఆలయ స్తంభాలు నాలుగు యుగాలను సూచిస్తాయని నమ్ముతారు.
అంటే ఈ నాలుగు స్థంబాలు సత్య యుగం, త్రేతా యుగం, ద్వాపర యుగం, కలియుగం. మూడు యుగాలు దాటి ఇప్పుడు నాలుగో యుగమైన కలియుగంలో ఉన్నాం. అదే విధంగా ఈ గుహ ఈ స్తంభాల్లో ఒకదానిపైనే నిలబడి ఉంది. ఎందుకంటే మిగలిన మూడు స్థంభాలు విరిగి పడిపోయాయి. చివరి స్తంభం విరిగితే అదే కలియుగ అంతానికి సూచన అని.. అప్పుడు ప్రపంచం అంతం అవుతుందని నమ్ముతారు. అంతేకాదు మారుతున్న కాలానికి అనుగుణంగా ఈ స్తంభాలు తమ ఎత్తును మారుతూ ఉంటుందనే నమ్మకం కూడా ఉంది. ఈ ఆలయంలో అద్భుత స్తంభాలు మాత్రమే కాదు ఇక్కడ శివలింగం కూడా ఓ రహస్యమే.. ఈ గుహలోని శివలింగం సహజంగా ఏర్పడింది.
ఈ ఆలయం కోట లోపల సుమారు 4,671 అడుగుల ఎత్తులో నిర్మించబడింది. ఆలయానికి సమీపంలో మూడు గుహలు ఉన్నాయి. కుడి గుహలో మంచుని తలపించే చల్లని నీటి మధ్యలో 5 అడుగుల శివలింగం ఉంది. వేసవిలో ఇక్కడి నీరు మంచులా చల్లగా మారుతుందని ప్రజలు అంటున్నారు. అదే సమయంలో ఇక్కడ నీరు శీతాకాలంలో గోరువెచ్చని నీరుగా మారుతుంది. ఈ నీటిలో స్నానం చేయడం వల్ల అన్ని పాపాలు, బాధలు, వ్యాధుల నుంచి ముక్తి లభిస్తుందని కూడా నమ్ముతారు.