భమ్ భోలేనాధ్ సినిమాతో డైరెక్టర్ గా తెలుగు ఎంట్రీ ఇచ్చాడు కార్తిక్ వర్మ దండు. ఈ సినిమా ఆశించిన ఫలితాన్ని అందించలేకపోయింది. ఇక మధ్యలో చాలా గ్యాప్ తీసుకొని సాయి ధరమ్ తేజ్ తో కలిసి విరూపాక్ష సినిమాను తెరకెక్కించాడు. చేతబడుల నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. తేజ్ బేక్ యాక్సిడెంట్ తరువాత రీఎంట్రీ ఇచ్చిన సినిమా.
అతని కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. అయితే . గతంలో నిఖిల్ సూపర్ హిట్ సినిమా ‘కార్తికేయ’ సినిమాకు రైటర్‌గా కూడా పనిచేశాడు ఆ తర్వాత 2015లో ‘భమ్ భోలేనాథ్’ మూవీతో డైరెక్టర్‌గా అదృష్టం పరీక్షించుకున్నాడు. అయితే ఈ సినిమా పెద్దగా ఆడలేదు. అయితే టేకింగ్ పరంగా పలువురి ప్రశంసలు అందుకున్నాడు.

మొదటి సినిమా తర్వాత చాలా గ్యాప్ తీసుకున్నాడు కార్తీక్. మెగా మేనల్లుడు, హీరో సాయి ధరమ్ తేజ్ తో కలిసి ‘విరూపాక్ష’ సినిమా తీశాడు. ఎలాంటి అంచనాలు లేకుండా రిలీజైన ఈ హారర్ థ్రిల్లర్ సూపర్ హిట్ గా నిలిచింది. బాక్సాఫీస్ వద్ద ఏకంగా రూ. 100 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ప్రస్తుతం అక్కినేని నాగచైతన్యతో కలిసి ఓ మైథలాజికల్ మూవీ తీస్తున్నాడు కార్తీక్. ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.
ఈ క్రమంలోనే హర్షిత అనే అమ్మాయితో పెళ్లిపీటలెక్కేందుకు రెడీ అయ్యాడు కార్తీక్ దండు. తన ఎంగేజ్‌మెంట్ వీడియోని కార్తీక్ ఇన్ స్టాలో పోస్ట్ చేశాడీ ట్యాలెంటెడ్ డైరెక్టర్. హర్షిత విషయానికి వస్తే.. ఈమెది సినిమా బ్యాక్ గ్రౌండ్ కాదని తెలుస్తోంది. కార్తీక్ దగ్గరి బంధువుల అమ్మాయని తెలుస్తోంది. పెళ్లి కూడా ఈ ఏడాది చివర్లో ఉండొచ్చని తెలుస్తోంది.
Production is in beast mode. My hero’s pushing boundaries. No compromises, only pure passion fueling every shot. This dream is becoming real — and it’s going to be epic! #NC24 @chay_akkineni @BvsnP @aryasukku @SVCCofficial @SukumarWritings @AJANEESHB @NavinNooli @Srinagendra_Art… pic.twitter.com/yGhRkZQjqx
— karthik varma dandu (@karthikdandu86) April 26, 2025