Karthika Masam | శివునికి ప్రీతిపాత్రమైన మాసం కార్తీక మాసం. ప్రతి ఏటా దీపావళి వెళ్ళిన మరుసటి రోజు నుంచి అతి పవిత్రమైన కార్తీక మాసం ప్రారంభమవుతుంది. ఈ మాసంలో భక్తులంతా నిత్యం భోళాశంకరుని నామాన్ని స్మరిస్తూ ఉంటారు. పురాణ కాలంనుంచీ ఈ మాసం ఓ ప్రత్యేకతను సంతరించుకుంది. హరిహరాదులకు ప్రీతిపాత్రమైన ఈ మాసంలో భక్తకోటి యావత్తూ కఠిన నిష్ఠతో చేపట్టే నోములకు ఎంతో ప్రాధాన్యం ఉంది. ఈ మాసంలో పాఢ్యమి, చవితి, పౌర్ణమి, చతుర్దశి, ఏకాదశి, ద్వాదశి తిధుల్లో శివపార్వతుల అనుగ్రహం కోసం మహిళలు పూజలు చేస్తుంటారు.
శక్తి వంతంగా చంద్రుడు
జ్యోతిష్యశాస్త్ర ప్రకారం నీటి మీదా, మానవుల మనసు మీదా చంద్రుని ప్రభావం అధికంగా ఉంటుంది. ఈ మాసంలో చంద్రుడు చాలా శక్తిమంతంగా ఉంటాడట. అందుకే ఈ కార్తీక మాసాన్ని ‘కౌముది మాసం అని కూడా అంటారు. చంద్ర కిరణాలతో ఔషధులతో తడిచిన నదులలో ఉదయాన్నే స్నానం చేయడం వలన ఆరోగ్యంగా ఉంటారని ఓ నమ్మకం. నదులను దైవంగా భావించి పూజిస్తారు. దీపాలు నీటిలో విడిచి పెట్టి భక్తిశ్రద్దలతో నీటిని పూజిస్తారు.
ఏ నదిలో లేదా ఇంట్లో స్నానం చేసినా సరే.. గంగేచ యమునేచైవ గోదావరి సరస్వతి.. నర్మదే సింధు కావేరీ జలేస్మిన్ సన్నిధింకురు అంటూ నదులను కీర్తిస్తూ మంత్రాన్ని పఠిస్తూ స్నానమాచరిస్తారు.ఈ కార్తీక మాసంలో తెల్లవారు జామునే నిద్ర లేచి నదుల వద్దకు చేరుకుని స్నానం చేసి సంకల్పం చెప్పుకుని పితృదేవతలను తల్చుకుని దాన ధర్మాలు చేస్తారు. అరటి కాండంలో దీపాలను వెలిగించి, భగవంతుడిని పూజిస్తారు.
అమల నాగార్జున కంటే ముందు ఆ హీరోతో ప్రేమలో పడ్డరా..?
మాంసం తినడం మంచిదా..
కార్తీక మాసం సరిగ్గా శీతాకాలం మొదలయ్యే సమయంలో వస్తుంది. అయితే పూర్వంలో శీతాకాలం వచ్చేటప్పటికీ చెరువులు, నదుల్లో నీరు మురికగా ఉండేదట. అందువల్ల చేపలు, ఇతర జలచరాలు కలుషితమై ఆరోగ్యానికి హాని కలిగించే అవకాశం ఉంది. అందుకే ఆ సమయంలో మాంసం తినకూడదని సూచించేవారట. అలాగే ఈ నెలలో దేవుడిని ప్రార్థించడంలో ఎక్కువ సమయం కేటాయించాలి అని భావించేవారు. అందుకే హింసాచారాలకు దూరంగా ఉండాలని చెప్పేవారు.
సిఎం చంద్రబాబు సోదరుడు అనారోగ్యంతో మృతి
కార్తీక మాసంలో నాన్ వెజ్ తినకూడదు అనడానికి మరో కారణం కూడా చెబుతారు.ఈ మాసం గొర్రెలు, మేకలకు సంతానోత్పత్తి కాలం.. అందుకే వాటి హింసించరు. తద్వారా మందలు మరింత పెరుగుతాయని ఆశిస్తారు.నిజానికి మాంసాహారం ఆరోగ్యానికి ఎటువంటి హానీ చేయదు. దీనిలోని ప్రోటీన్లు, విటమిన్లు శరీరానికి బలాన్నిస్తాయి. కార్తీక మాసంలో నాన్ వెజ్ తింటే మంచిది కాదు అనే అభిప్రాయం పూర్తిగా తప్పు. కార్తీక మాసంలో మాంసం తినకూడదనే నమ్మకానికి ఎటువంటి శాస్త్రీయ ఆధారం లేదు. అది ఒక సంప్రదాయం మాత్రమే. ఈ సంప్రదాయం ప్రతి ఒక్కరి వ్యక్తిగత నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది.