గతేడాది కన్నడ నటి రన్యా రావు దుబాయ్ నుంచి బెంగళూరుకు అక్రమంగా బంగారాన్ని తరలిస్తూ పట్టుబడ్డ సంగతి తెలిసిందే. ఆ సమయంలో ఆమె.. తన తండ్రి డీజీపీ రామచంద్రరావు అధికారిక హోదాను, ప్రోటోకాల్‌ను వాడుకున్నారనే ఆరోపణలు వచ్చాయి. అప్పట్లో ఈ కేసు తీవ్ర దుమారం రేపింది. అయితే ఇందులో తన పాత్రేమి లేదని, తనకు ఏమీ తెలియదని రామచంద్రరావు చెప్పినప్పటికీ.. ప్రోటోకాల్ దుర్వినియోగంపై అనుమానంతో కర్ణాటక ప్రభుత్వం ఆయన్ని తప్పనిసరి సెలవుపై పంపింది.
అయితే కర్ణాటకలోని డీజీపీ స్థాయి అధికారి కె.రామచంద్రరావు పలువురు మహిళలతో అసభ్యంగా ప్రవర్తించిన వీడియోలు బయటపడటం దుమారం రేపింది. దీనిపై దర్యాప్తు చేపట్టిన అక్కడి ప్రభుత్వం తాజాగా చర్యలు తీసుకుంది. రామచంద్రరావును సస్పెండ్ చేసింది. ఈమేరకు సస్పెన్షన్ ఉత్తర్వులు జారీ చేసింది. రామచంద్రరావు ప్రభుత్వ ఉద్యోగిగా రూల్స్ ఉల్లంఘించారని అందులో పేర్కొంది.
ఇది ప్రభుత్వానికి సైతం ఇబ్బందిగా మారినట్లు చెప్పింది. అందుకే ఆయన్ని సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటన చేసింది. సస్పెన్షన్ సమయంలో ప్రభుత్వ పర్మిషన్ లేకుండా రామచంద్రరావు హెడ్‌క్వార్టర్స్ నుంచి బయటికి వెళ్లొద్దని ఆదేశాలు జారీ చేసింది. ఇదిలాఉండగా డీజీపీ ఆఫీసులో రామచంద్రరావు పలువురు మహిళలతో సన్నిహితంగా ఉన్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. వీటిపై నెటిజన్లు తీవ్రంగా విమర్శలు చేశారు. డ్యూటీలో ఉండగా ఇలా ప్రవర్తించడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేశారు.
దీనిపై స్పందించిన సీఎం సిద్ధరామయ్య వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మరోవైపు ఈ వీడియోలను రామచంద్రరావు ఖండించారు. అందులో ఉందని తాను కాదని.. మార్ఫింగ్ చేశారంటూ పేర్కొన్నారు. ఎవరో కావాలనే కుట్రపన్ని ఏఐతో వీడియో చేశారంటూ చెప్పారు. కానీ చాలామంది అది నిజమనే అంటున్నారు. మొత్తానికి ఈ అంశం కర్ణాటకలో సంచలనం రేపుతోంది.
A fresh controversy has erupted in #Karnataka after a video allegedly showing a DGP-rank IPS officer engaging in inappropriate behaviour with women inside his office surfaced in the public domain.
— Hate Detector 🔍 (@HateDetectors) January 19, 2026
Unlike earlier scandals involving political figures, this episode reportedly… pic.twitter.com/pQszE1jyeR
