కరిష్మా శర్మ.. కెరీర్ మొదటి నుంచి సినిమాల కంటే ఎక్కువగా ఫోటోషూట్స్ వైపు అడుగులు వేసింది కరిష్మా. అదే ఈమె కెరీర్‌కు శాపంగా మారిపోయింది. అయితే కరిష్మా శర్మ రన్నింగ్ ట్రైన్ నుంచి దూకేశారు. ఆమెకు గాయాలవ్వడంతో ఆసుపత్రిలో జాయిన్ చేశారు. ఈ విషయాన్ని ఆమె సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు.
కదులుతున్న రైలు నుంచి ఎందుకు దూకాల్సి వచ్చిందో తెలుపుతూ తన ఇన్‌స్టా స్టోరీలో పోస్ట్ పెట్టారు. తనకు దెబ్బలు తగిలాయని, తలకు గాయం అవ్వడంతో డాక్టర్లు ఎంఆర్ఐ చేశారని తెలిపారు. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నానని, ఒకరోజు వైద్యుల పర్యవేక్షణలో ఉండాలని సూచించారని చెప్పారు.

తాను ధైర్యంగా ఉన్నానని, త్వరగా కోలుకోడాని అందరి ప్రేమాభిమానాలు కావాలని కరిష్మా పేర్కొన్నారు. ”ఓ సినిమా షూటింగ్ లొకేషన్ కు వెళ్లడానికి చీర ధరించి బయల్దేరాను. నేను చర్చిగేట్ రైల్వే స్టేషన్లో లోకల్ ట్రైన్ ఎక్కాను. అది వెంటనే వేగంగా కదిలింది. దీంతో నా స్నేహితులు ఆ రైలు అందుకోలేకపోయారు.
వాళ్లు రైలు ఎక్కలేకపోయారనే టెన్షన్ లో నేను భయంతో నేను కదులుతున్న రైల్లో నుంచి కిందికి దూకేశాను. వెనక్కి తిరిగి పడడంతో నా వీపు, తలకు గాయాలయ్యాయి. నేను త్వరగా కోలుకునేందుకు మీ అందరి ప్రేమ, అభిమానం అవసరం” అని కరిష్మా శర్మ తన స్టోరీలో రాసుకొచ్చారు.
