ట్రాఫిక్ చలాన్లు కాదు.. ముందు మీరు టాక్స్ కట్టండి..అంటూ గుంతల రోడ్డుపై కూర్చొని యువకుడు వినూత్న నిరసన..!

divyaamedia@gmail.com
1 Min Read

కరీంనగర్–నిజామాబాద్ జాతీయ రహదారి రేకుర్తి వద్ద గుంతలతో నిండిపోయిన రోడ్డు పక్కనే శ్యాం కుమార్ ప్లకార్డులతో కూర్చుని నిరసన వ్యక్తం చేశాడు. చిరు జల్లులు పడితేనే ఈ రహదారి చిత్తడిమయమవుతోందని, వర్షాకాలం రాగానే వాహనదారుల ప్రయాణం ప్రాణాలకు సైతం హానికరమవుతోందని ఆవేదన వ్యక్తం చేశాడు. అయితే బైక్‌పై వెళ్తే నిబంధనల పేరుతో ఫైన్ వేస్తున్నారు. అన్ని రకాల టాక్సులు వసూలు చేస్తున్నారు.

కానీ.. రోడ్డు మరమ్మతులు చేయడం లేదంటూ ఓ యువకుడు వినూత్న రీతిలో నిరసన తెలిపారు. ఏకంగా నడిరోడ్డుపై గుంతలో కూర్చొని నిరసన తెలిపారు. అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసిన పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కరీంనగర్‌లోని రేకుర్తి చౌరస్తాలో గత కొన్ని సంవత్సరాలుగా రోడ్డు అధ్వాన్నంగా మారిపోయింది. కరీంనగర్ నుండి నిజామాబాద్ నేషనల్ హైవే అయినప్పటికీ అధికారులు గాని, పొలిటికల్ లీడర్స్ గాని ఎవరూ పట్టించుకోవడం లేదని కరీంనగర్‌కు చెందిన కోట శ్యామ్ కుమార్ నిరసన కార్యక్రమం చేపట్టారు.

అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసిన పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. రోడ్డు బాగా లేక ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారని శ్యామ్ కుమార్ వాపోయారు. రోడ్డుపై వాహనం నడపాలంటేనే భయం వేస్తుందన్నారు. మరోవైపు ట్రాఫిక్ నిబంధనలు పాటించడం లేదని పోలీసులు ఫైన్‌ల రూపంలో జరిమానాలు కట్టిస్తున్నారన్నారు. GST లు, రోడ్డు టాక్స్ కడుతున్నాను కానీ, అసలు రోడ్లే సరిగా లేవని శ్యామ్ ఆరోపించారు.

ఈ నేపథ్యంలోనే అధ్వాన్నంగా తయారైన రోడ్డుకు మరి మీరు నాకెంత ఫైన్ కడతారు అని కరీంనగర్ కలెక్టర్, పోలీస్ కమిషనర్‌ను ప్రశ్నించారు. ముందుగా రోడ్లు నిర్మించి.. తరువాత ఫైన్ లు వసూలు చేయాలని డిమాండ్ చేశాడు. ఈ రోడ్డు కారణంగా చాలా మంది ప్రమాదాలకు గురువుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం పట్టించుకోవాలని వేడుకున్నారు శ్యామ్ కుమార్.

Share This Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *