బర్త్ డే కేక్ విషయంలో ఇరువురి మధ్య వాగ్వాదం జరగ్గా సిబ్బందిని కల్పిక బూతులు తిట్టిందని పబ్ యాజమాన్యం ఆరోపించింది. ఇదిలా ఉంటే.. గచ్చిబౌలి విప్రో సర్కిల్ వద్ద ఉన్న ప్రిజం పబ్ లో బర్త్ డే వేడుకలు నిర్వహించారని.. బర్త్ డే కేక్ విషయంలో ఇరువురి మధ్య వాగ్వాదం జరగ్గా.. పబ్ సిబ్బంది తనపై దాడి చేశారని కల్పిక తెలిపింది. అయితే టాలీవుడ్ నటి కల్పిక మరో సారి వివాదంలో చిక్కుకున్నారు.
గత 29న ప్రిజం పబ్లో పుట్టినరోజు సందర్బంగా నటి కల్పిక తన స్నేహితులకు పార్టీ ఇచ్చారు. ఈ క్రమంలో కేకు విషయంలో పబ్ సిబ్బంది.. నటి కల్పిక మద్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలో పబ్ యాజమాన్యంపై దురుసుగా ప్రవర్తించడమే కాకుండా.. బిల్ పే చేయకుండా సిబ్బంది పట్ల అసభ్యంగా ప్రవర్తించినందుకు ప్రిజం పబ్ యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేసింది.

పబ్లో జరిగిన గొడవను యాజమాన్యం రికార్డు చేసింది. దీనికి సంబంధించిన వీడియోలను పోలీసులకు అందించింది. కాగా ఈ గొడవకు సంబంధించి నటి కల్పిక వివరణ ఇచ్చారు. కేకు విషయంలో పబ్ సిబ్బంది తనతో దురుసుగా ప్రవర్తించారని, బూతులతో రెచ్చిపోయారని, తనను డ్రగ్ అడిక్ట్ అంటూ దూషించడంవలనే సిబ్బందితో వాగ్వాదం జరిగిందని ఆమె అన్నారు.
గొడవకు సంబంధించిన వీడియోలను కల్పిక తన సోషల్ మీడియా ఖాతాల్లో షేర్ చేశారు. అంతేకాదు.. సోషల్ మీడియా వేదికగా పోలీసుల తీరును కూడా ఆమె ప్రశ్నించారు.