కల్పన ఆత్యహత్యాయత్నం ఎందుకు చేసింది? ఆమె లైఫ్‌లో ఏం జరిగిందనేది అనేక అనుమానాలకు తావిస్తుంది. తన భర్తతో కలిసి నిజాంపేటలోని తన ఇంట్లో నివాసం ఉంటుంది కల్పన. కానీ రెండు రోజుల క్రితమే భర్తతోపాటు కుటుంబ సభ్యులు ఇంటి నుంచి వెళ్లిపోయారని, అప్పటి నుంచి కల్పన ఒక్కరే ఇంట్లో ఉంటున్నారని స్థానికుల నుంచి తెలుస్తుంది. అయితే తాజాగా దీనిపై సింగర్ కల్పన కూతురు దయ ప్రసాద్ ప్రకర్ స్పందించింది. ఆమె ఆసుపత్రిలో తన తల్లిని పరామర్శించింది.
దగ్గరుంచి చూసుకుంటుంది. ఈ క్రమంలో ఆమె మీడియాతో మాట్లాడింది. అసలు జరిగింది ఏంటో వెల్లడించింది. కల్పన ఆత్మహత్యయత్నం చేయలేదని ఆమె స్పష్టం చేసింది. తను ఇన్సోమియా పేషెంట్ కావడంతో డాక్టర్ల సూచనల మేరకు ఆమె కొన్ని టాబ్లెట్లు తీసుకుంటుంది. అయితే వాటి డోస్ పెరగడంతో, హై డోస్ కారణం వల్ల తన తల్లి అపస్మారక స్థితిలోకి వెళ్లిందన్నారు. తమ కుటుంబంలో ఎలాంటి గొడవలు లేవని ఆమె చెప్పింది. తాము అంతా సంతోషంగానే ఉన్నట్టు వెల్లడించారు.
మమ్మి హెల్త్ విషయంలో తప్పుడు ప్రచారం చేయోద్దని, ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని చెప్పింది. త్వరలోనే ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అవుతుందని కల్పన కూతురు దయ ప్రసాద్ ప్రకర్ వెల్లడించారు. మొత్తంగా తమ ఫ్యామిలీలో గొడవలు లేవని, హై డోస్ టాబ్లెట్ల వల్లనే ఇదంతా జరిగిందని కూతురు తెలిపింది. దీంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. ఇక కల్పన ఆరోగ్య పరిస్థితిపై వైద్యులు స్పందించారు.
ప్రస్తుతం నిలకడగానే కల్పన ఆరోగ్యం ఉందని, అపస్మారక స్థితిలో ఆసుపత్రికి రావడంతో వెంటిలేటర్‌పై వైద్యం అందించినట్టు తెలిపారు. ఇప్పుడు వైద్యానికి సహకరిస్తుందని చెప్పారు. మరో రెండు మూడు రోజుల్లో కల్పన డిశ్చార్జ్ అయ్యే అవకాశం ఉందని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు. ఆసుపత్రిలో కల్పన కదులుతున్న వీడియో ఒకటి బయటకు వచ్చింది. ఇందులో ఆమె ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్టుగా తెలుస్తుంది.